ETV Bharat / international

'వ్యాక్సిన్ల ఉత్పత్తికి విదేశీ సంస్థలతో పొత్తుకు సిద్ధం'

author img

By

Published : Oct 30, 2020, 12:57 PM IST

విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలిసి తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు రూపొందిస్తున్న టీకాలపై ఈ సందర్భంగా విమర్శలు చేశారు పుతిన్​.

Russia ready to produce Covid vax at foreign sites of partners: Putin
'వ్యాక్సిన్ల ఉత్పత్తికి విదేశీ సంస్థలతో కలిసేందుకు సిద్ధం'

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్, ఎపివాక్​ కరోనా టీకాల ఉత్పత్తిపై కీలక ప్రకటన చేశారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెక్టార్ ఇన్​స్టిట్యూట్, గమలేయ ఇన్​స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు అవసరమైతే విదేశీ సంస్థలతో కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అలాగే అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు తయారు చేస్తున్న టీకాలపై ఆరోపణలు చేశారు పుతిన్​. ఆ టీకాలను కోతి, చింపాంజీలోని అడెనోవైరస్ నుంచి తయారు చేసినట్లు చెప్పారు. అలా చేయడం వల్ల ఫలితాలు సరిగా రావన్నారు పుతిన్​. గమలేయ ఇనిస్టిట్యూట్‌లో తమ పరిశోధకులు అడెనోవైరస్​ను ఉపయోగించడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని వివరించారు. ఆ తర్వాత తాము మానవ అడెనోవైరస్ ఆధారంగా వ్యాక్సిన్​ను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అది సమర్థంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

తమ దేశంలో తయారైన టీకాల్లో ఎలాంటి లోపం లేదన్నారు పుతిన్​. వెక్టార్ ఇన్​స్టిట్యూట్, గమలేయ ఇన్​స్టిట్యూట్​లో రూపొందించిన రెండు టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే టీకాలను రష్యాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సామూహిక వ్యాక్సినేషన్​ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు పుతిన్​.

ఇదీ చూడండి:కరోనాకు రష్యా రెండో వ్యాక్సిన్ రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.