ETV Bharat / international

కరోనాపై పోరాడలేక కేంద్ర ఆరోగ్య మంత్రి రాజీనామా - latest coron news

రొమేనియా కేంద్ర ఆరోగ్య మంత్రి విక్టర్​కొస్టాక్​ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దేశంలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Romania health minister resigns as country struggles to stem virus
కరోనాను అరికట్టలేక కేంద్ర ఆరోగ్య మంత్రి రాజీనామా
author img

By

Published : Mar 26, 2020, 9:04 PM IST

రొమేనియా కేంద్ర ఆరోగ్య మంత్రి విక్టర్​ కొస్టాక్​ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు గల కారణాలను ఆయన తెలుపలేదు. దేశంలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలిగారు.

వ్యక్తిగత కారణాలతో కొస్టాక్​ రాజినామా చేశారని రొమేనియా ప్రధాని లుడోవిక్​ ఆర్బన్​ తెలిపారు. 'కొస్టాక్​ రాజీనామా చాలా బాధకారమైన విషయం. నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం ప్రభుత్వానికి ఆయన అందించిన సేవలకు నా ధన్యావదాలు' అని అన్నారు ప్రధాని.

సోషల్​ మీడియాలో రగడ...
రొమేనియాలో ఇప్పటివరకు 1,029 కరోనా కేసులు నమోదవ్వగా... 17మంది మరణించారు. అనేక మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్​ బారిన పడ్డారు.
కరోనా చికిత్సకు సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేవని, కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదని ఇటీవల ఆ దేశ వైద్యాధికారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శించారు.

ఇదీ చూడండి : అమెరికాలో మన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.