omicron virus news : ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) (WHO on omicron variant) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు రోగనిరోధకవ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందన్న డబ్ల్యూహెచ్‌వో.. భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. వ్యాక్సినేషన్ వేగవంతం సహా ఆరోగ్య రంగ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో 26 నుంచి 32 వరకూ ఉత్పరివర్తనాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్‌వో.. వాటిలో కొన్నింటికి రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం, వేగంగా వ్యాపించే లక్షణం (omicron variant symptoms) ఉందని తెలిపింది. ఫలితంగా ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒమిక్రాన్‌కు ఉన్న లక్షణాలతో రాబోయే రోజుల్లో కొవిడ్ కేసుల (omicron variant cases) సంఖ్య పెరిగే అవకాశముందని, అదే జరిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంచనావేసింది.
ఇదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ (omicron variant ) కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేసుల్లో పెరుగుదల, తీవ్రతలో మార్పు కారణంగా ఆరోగ్య రంగ వ్యవస్థలపై భారం పడే అవకాశముందని పేర్కొంది. అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య పెరగడంతో పాటు మరణాలు సైతం అధికంగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న దేశాలపై ప్రభావం పడే అవకాశముందని అంచనావేసింది. ఈ నేపథ్యంలో ప్రాధాన్య వర్గాలకు వ్యాక్సిన్లను అందించడం వేగవంతం చేయడం సహా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసుకోవాలని సభ్యదేశాలకు సూచించింది.
మరోవైపు మునుపటి ఇన్‌ఫెక్షన్ల నుంచి, వ్యాక్సిన్‌ల (vaccines for omicron variant) ద్వారా సంక్రమించిన రోగనిరోధకశక్తిని తప్పించుకునే విషయంలో ఒమిక్రాన్ సామర్థ్యం అంచనావేసేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: ఒమిక్రాన్ ఎలా పుట్టింది?.. ఎందుకంత ప్రమాదకరంగా మారింది?