ETV Bharat / international

విరాళాల యోధుడు మూరేకు బ్రిటన్ ఘన నివాళి

author img

By

Published : Feb 4, 2021, 10:29 AM IST

కెప్టెన్ టామ్ మూరేకు బ్రిటన్ ఘన నివాళులు అర్పించింది. ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపుతో ప్రజలంతా చప్పట్లతో ఆయనకు సంతాపం తెలిపారు. బ్రిటన్ పార్లమెంట్​లో సభ్యులంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ సైతం మూరే కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ributes-were-paid-to-captain-sir-tom-moore-in-his-home-village
కెప్టెన్ మూరేకు బ్రిటన్ ఘన నివాళి

మాజీ యుద్ధ సైనికుడు కెప్టెన్ టామ్ మూరేకు ఘనంగా నివాళులు అర్పించారు బ్రిటన్ ప్రజలు. మూరే సొంత గ్రామంలోని ఇంటి వద్ద వందల సంఖ్యలో అభిమానులు పుష్పాంజలి ఘటించారు.

యూకే పార్లమెంట్​ సైతం మూరే మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది. సంతాప సూచికగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు పార్లమెంట్ సభ్యులు.

మూరే జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా ప్రజలంతా చప్పట్లు కొట్టాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. దీంతో సాయంత్రం ఆరుగంటలకు ప్రజలంతా ఆయనకు సంతాపంగా చప్పట్లు కొట్టారు. దేశ భద్రతా సిబ్బంది సైతం ఇందులో పాలుపంచుకున్నారు. హారోగేట్​లోని యనియాకే బ్యారక్స్​కు చెందిన బ్రిటీష్ సైనికులు చప్పట్లు కొట్టి సంతాపం తెలిపారు.

మూరేకు ఘన నివాళి

భారత్​తో టెస్టు సిరీస్​ కోసం సన్నద్ధమవుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సైతం మూరేకు సంతాపం ప్రకటించారు. 'అత్యంత చీకటి సమయంలో దేశ ప్రజలు చిరునవ్వు చిందించేందుకు ఆయన కారణమయ్యారు' అని కీర్తించారు. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ తరపున మూరే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎవరీ టామ్ మూరే

లాక్​డౌన్ సమయంలో కరోనా యోధులకు ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచనతో.. తన ఇంటి పెరట్లో నడుస్తూ విరాళాలు పోగు చేశారు టామ్. పెరట్లో వంద రౌండ్లు నడిచి.. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్​ కోసం వెయ్యి పౌండ్లు సేకరించాలని తొలుత భావించారు. వయసు వందేళ్లకు దగ్గరపడుతున్న సమయంలోనూ ఇలాంటి ఆలోచనకు పూనుకున్న మూరేను చూసి వేల సంఖ్యలో దాతలు ముందుకొచ్చారు. బ్రిటన్​తో పాటు అమెరికా, జపాన్ తదితర దేశాల నుంచి విరాళాలు వచ్చాయి. మొత్తం 3.3 కోట్ల పౌండ్లు(దాదాపు రూ.329 కోట్లు) పోగయ్యాయి. మూరే ఆలోచనకు మెచ్చి.. 'సర్' బిరుదుతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 సత్కరించారు.

కొద్దిరోజులుగా నిమోనియాకు చికిత్స పొందుతున్న ఆయనకు.. గతవారం కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఆరోగ్యం క్షీణించి మరణించారు.

ఇదీ చదవండి: ఆ పెద్దాయన నడిచినందుకే 15 లక్షల పౌండ్ల విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.