కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో హెపటైటిస్-సి ఔషధం రెమిడెసివిర్ అత్యంత ప్రభావవంతమైన యాంటీవైరస్గా పనిచేయగలదని తాజా అధ్యయనం పేర్కొంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని చేపట్టారు.
"మహమ్మారి తొలినాళ్లలో రెమిడెసివిర్ ఔషధ యాంటీవైరల్ లక్షణాల గురించి లోతైన అధ్యయనం సాగలేదు. బ్రిటన్‌కు చెందిన కొవిడ్ బాధితునికి తొలి 84 రోజుల పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఔషధాలు ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో రెమిడెసివిర్‌ను ఇచ్చి చూశారు. ఔషధం ఇచ్చిన 38 గంటల్లో సదరు వ్యక్తి జ్వరం, శ్వాస సమస్యల నుంచి తెరిపిన పడ్డాడు. 48వ రోజు వైద్యులు అతడిని డిశ్చార్జి కూడా చేశారు. అయితే 54వ రోజు సదరు బాధితుడు అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. దీంతో రెండోసారి 10 రోజుల పాటు రెమిడెసివిర్ చికిత్స అందించారు. 64వ రోజు అతనికి నెగెటివ్ ఫలితం వచ్చిందని పరిశోధకుడు జేమ్స్ ధావెంతిరాన్ చెప్పారు.