ప్రిన్స్ హ్యారీ స్వతంత్రంగా జీవించటానికి అంగీకరించారు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2. యూకే, కెనడా దేశాల్లో కొంత కాలం గడపడానికి వారికి అనుమతిని ఇచ్చారు. హ్యారీ, అతని భార్య మేఘన్‌తో బ్రిటన్ రాణి జరిపిన ముఖాముఖి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది బకింగ్‌హామ్ ప్యాలెస్.
"మా మనవడు అతని కుటుంబం భవిష్యత్తు నిర్ణయంపై చర్చలు జరిగాయి. హ్యారీ, అతని భార్య కొత్త జీవితాన్ని గడపటానికి మా కుటుంబం మొత్తం పూర్తిగా అంగీకరిస్తున్నాం. రాజకుటుంబ సభ్యులుగా కొనసాగాలని కోరాం. స్వతంత్రగా జీవించాలనే నిర్ణయాన్ని అర్థం చేసుకొని వారి కోరికను గౌరవిస్తున్నాం."
- బకింగ్‌హామ్ రాజభవనం ప్రకటన
ఈ కొత్త జీవితంలో బ్రిటన్ ప్రజా ధనాన్ని వినియోగించకూడదని హ్యారీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇలాంటి సంక్లిష్టమైన అంశాలపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఉందని రాణి అభిప్రాయపడ్డారు.
నటిగా రీ ఎంట్రీ...
ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన హ్యారీ, మేఘన్.. తమ ఉద్యోగ ప్రయత్నాలను మొదలుపెట్టారు. పెళ్లికి ముందు మేఘన్ వదిలేసిన నటనవైపే ఆమె మొగ్గు చూపారు. ఈ మేరకు డిస్నీ లండన్‌తో మేఘన్ ఒప్పందం చేసుకున్నారు.
ఇదీ చూడండీ:కశ్మీర్లో ఎదురు కాల్పులు-ఉగ్రవాది హతం