ETV Bharat / international

పోప్​కు వచ్చేవారం టీకా- నెతన్యాహుకు రెండో డోసు

పోప్ ఫ్రాన్సిస్ కరోనా టీకా తీసుకోనున్నారు. వాటికన్​ సిటీలో వచ్చే వారం వ్యాక్సినేషన్​ ప్రారంభమవుతుందని ఓ టీవీ ఛానల్​తో ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు ఫైజర్​ టీకా రెండో డోసును ఆదివారం తీసుకున్నారు.

Pope Francis likely to get vaccinated against COVID-19 next week
పోప్ ఫ్రాన్సిస్​కు వచ్చేవారం టీకా- నేతన్యాహుకు రెండో డోసు
author img

By

Published : Jan 10, 2021, 5:32 PM IST

Updated : Jan 10, 2021, 9:07 PM IST

వాటికన్​ సిటీలో వచ్చేవారం కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతుందని పోప్ ఫ్రాన్సిస్​ తెలిపారు. తాను కూడా టీకా తీసుకుంటానని చెప్పారు. ఇటలీలో ఓ టీవీ ఛానల్​తో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

అబార్షన్​ను వ్యతిరేకించే బృందాలు వ్యాక్సిన్​ తయారీపై ఇటీవల పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే పరిశోధన, ఉత్పత్తి ప్రక్రియలో గర్భస్రావం చేసిన పిండాల నుంచి కణ తంతువులను ఉపయోగించిన కొవిడ్ -19 వ్యాక్సిన్లను స్వీకరించడం నైతికంగా ఆమోదయోగ్యమే అని, ఇందుకు పోప్​ కూడా అంగీకరించారని వాటికన్ కాంగ్రిగేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

బ్రిటన్​ మహారాణి ఎలిజెబెత్​, యువరాజు ఫిలిప్ కరోనా టీకాను శనివారమే తీసుకున్నారు.

నెతన్యాహుకు రెండో డోసు..

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫైజర్ టీకా రెండో డోసును ఆదివారం తీసుకున్నారు. ఆయనతో పాటు ఆరోగ్యమంత్రి యులి ఎడెల్​స్టీన్​ కూడా వ్యాక్సిన్​ రెండో డోసు అందుకున్నారు.

వచ్చే మూడు నెలల్లో ఇజ్రాయెల్​లోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ అందుతుందని నెతన్యాహు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫైజర్​ సంస్థతో మరిన్ని టీకాలు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకున్నాక ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచి సాధారణ జీవితం మళ్లీ పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​పై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు డిసెంబర్​ 20న ఇజ్రాయెల్​లో ఫైజర్​ తొలి టీకాను నెతన్యాహునే తీసుకున్నారు.

ఇదీ చూడండి: ట్విట్టర్​కు చెక్ పెట్టేలా ట్రంప్​ 'పార్లర్​ స్కెచ్'!

Last Updated : Jan 10, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.