2022 చివరినాటికి భారత్ 500 కోట్ల టికా డోసులను ఉత్పత్తి చేసి కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ-20 సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాపై పోరులో భారత్ భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాలను పరస్పరం గుర్తించుకోవడం వంటి అంశాలను కూడా మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిపారు. భారత్ స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలపాల్సి ఉన్న విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారని, ఈ టీకాకు వస్తే ఇతర దేశాలకు భారత్ మరింత చేయగలదని వివరించినట్లు పేర్కొన్నారు. కరోనా పాండెమిక్ సమయంలో 150 దేశాలు భారత్ ఔషధాలు సరఫరా చేసిందని మోదీ గుర్తు చేశారన్నారు. 'ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సెషన్'లో మోదీ ఈమేరకు మాట్లాడినట్లు చెప్పారు.
నిలకడగల ప్రపంచ సరఫరా గొలుసుల ఆవశ్యకతను నొక్కిచెప్పిన ప్రధాని మోదీ.. భారత్ సాహసోపేత ఆర్థిక సంస్కరణల గురించి ఈ సెషన్లో మాట్లాడారు. ఆర్థిక పునరుద్ధరణ, సరఫరా గొలుసు వైవిధ్యీకరణలో భారత్‌ను తమ భాగస్వామిగా మార్చుకోవాలని G20 దేశాలను ఆహ్వానించారు.