ఇటలీ పర్యటనలో (Modi Italy tour) భాగంగా వాటికన్ సిటీని సందర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్రైస్తవ మతగురువు, క్యాథలిక్ చర్చిల అధిపతి పోప్ ఫ్రాన్సిస్‌ను (Modi Pope Francis) కలుసుకున్నారు. ఇరుదేశాల మధ్య (Modi in Italy) విశ్వాసం పెంపొందించే విధంగా ఈ భేటీ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
![PM Modi to meet Pope Francis in Vatican City](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13500500_fc71xy4wya4zwhs-2.jpg)
![PM Modi to meet Pope Francis in Vatican City](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13500500_fc71xy4wya4zwhs-1.jpg)
ప్రపంచానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగినట్లు అధికారులు చెప్పారు. కరోనా వైరస్, ఆరోగ్య సమస్యలు ప్రస్తావనకు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్‌ను భారత్‌కు రావాలని కోరారు మోదీ. దేశంలో పర్యటించాలని విన్నవించారు.
![PM Modi met Pope Francis in Vatican City](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13500500_fc71xy4wya4zwhs-3.jpg)
![PM Modi met Pope Francis in Vatican City](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13500500_fc71xy4wya4zwhs-4.jpg)
2013లో పోప్‌గా మారిన తర్వాత ఫ్రాన్సిస్‌ను తొలిసారి కలుసుకున్నారు ప్రధాని మోదీ. ముందస్తు షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాల పాటు సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ.. గంటకు పైగా వీరి భేటీ కొనసాగడం విశేషం.
వాటికన్ సిటీ కార్యదర్శి కార్డినల్ పెట్రో పరోలిన్‌ను సైతం మోదీ కలిశారు.
ఘన స్వాగతం
అంతకుముందు, వాటికన్ సిటీలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. అక్కడి అధికారులు మోదీకి సాదరంగా ఆహ్వానం పలికారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం ప్రధాని వెంట వెళ్లారు.
వీటిపై చర్చ!
పోప్‌తో మోదీ (Modi Pope Francis) ద్వైపాక్షిక చర్చలు జరిపారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా వెల్లడించారు. ఈ సమావేశానికి అజెండా నిర్ణయించలేదని, అది అక్కడి సంప్రదాయం కాదని తెలిపారు.
ఇదీ చదవండి: