ETV Bharat / international

ఇద్దరు భామలతో 'శునకం' క్రేజీ ఎక్సర్​సైజులు! - శునకం ఫన్నీ ఎక్సర్​సైజులు

ఉదయపు నడక సమయంలో పెంపుడు శునకాలను తమతోపాటు తీసుకెళ్తుంటారు కొందరు. వారు పరుగెడితే అవి కూడా వారిని అనుకరిస్తాయి. అయితే.. ఓ శునకం మాత్రం కాస్త భిన్నంగా వ్యాయామాలు చేస్తోంది. చూడముచ్చటగా ఉన్న ఆ శునకంతో ఇద్దరు మహిళలు.. వర్కౌట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్​గా మారింది.

a pet dog working out with two girls
a pet dog working out with two girls
author img

By

Published : Aug 18, 2021, 11:59 AM IST

తమ పెంపుడు శునకంతో ఇద్దరు మహిళలు వర్కౌట్ చేస్తున్న ఓ వీడియో వైరల్​గా మారింది. అథ్లెటిక్ దుస్తులు ధరించిన ఆ ఇద్దరు భామలు.. అచ్చం తాము చేస్తున్నట్లే చేయమంటూ శునకాన్ని ఉత్సాహపరిచారు. తమను అనుకరించమని దాన్ని ప్రోత్సహిస్తున్న తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 10 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో చాలా లైక్‌లు, రీట్వీట్‌లు, కామెంట్లతో సంపాదించుకుంది. బ్యూటెంజిబిడెన్ అనే యూజర్ ట్విట్టర్​లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 'వర్కౌట్ బడ్డీ.. వర్కౌట్..' అని క్యాప్షన్ పెట్టారు.

అదిరిపోయే కామెంట్లు..

ఇప్పటికే 70 వేల వీక్షణలతో దూసుకెళ్తోన్న ఈ వీడియోపై యూజర్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

  • 'ఏంటీ శునకం గారూ.. స్లిమ్​గా మారేందుకు వర్కౌట్లు మొదలుపెట్టారా?' అని ఒకరు చమత్కరించారు.
  • 'ఎక్సర్​సైజులు బాగానే చేస్తున్నావ్.. జాగ్రత్తలు తీసుకున్నావా? లేదా?' అని శునకాన్ని అడుగుతున్నట్లుగా ఒకరు కామెంట్ చేశారు.
  • 'ఓ శునక మహారాజా ఆరోగ్యంపై నీకున్న శ్రద్ధ మాకు ఉంటే ఎంత బాగుండు'.. అని మరొకరు రాశారు.
  • 'ఇట్స్ వెరీ గుడ్' అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. అత్యంత అందమైన దృశ్యం అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
    a pet dog working out with two girls
    మహిళలతో ఏమాత్రం తగ్గకుండా వర్కౌట్లు
    a pet dog working out with two girls
    భలే ఉంది తమాషా..
    a pet dog working out with two girls
    శునకం ఎక్సర్​సైజులు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.