ఐరాస అమెరికా పర్యావరణ విభాగం 2018 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 300 మిలియన్ టన్నుల వ్యర్థ పదార్థాలు, చెత్త పేరుకుపోతుండగా అందులో 9 శాతం మాత్రమే పునర్వినియోగం జరుగుతోంది.
ప్లాస్టిక్ సీసాల కారణంగా సంవత్సరంలో 13 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ పోగవుతోందని ఆ సంస్థ తెలిపింది. ఇలాగే పరిస్థితులు కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రతి సంవత్సరం ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా లక్షకు పైగా సముద్ర జీవరాసులు మృత్యువాత పడుతున్నాయి.
ఇందుకు ప్రత్యమ్నాయంగా ఇటలీకి చెందిన నోవామోంట్ వ్యాపార సంస్ధ మార్కెట్ లోకి బయో ప్లాస్టిక్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. 2008 సంవత్సరంలో బయోప్రాడక్ట్ 'మాటర్-బై'ని జర్మనీలోని హైడ్రా మెరైన్ సైన్స్ జిఎమ్బిహేచ్ సంస్థ పరీక్షించింది. ఈ రకం ప్లాస్టిక్‌ని పాకేజింగ్, డిస్పోజల్ టేబుల్‌వేర్, వ్యవసాయం, అలంకరణ సామగ్రి, ఫార్మాస్యూటికల్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తులు భూమిలో, నీటిలోనూ కుళ్లిపోయే విధంగా రూపొందించారు.
"ఇందులో మూడంచెల పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షించిన పదార్థాలు సహజ సముద్ర వాతావరణంలో కూడా క్షీణిస్తాయి. ఈ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది. ప్లాస్టిక్ ఏ దశల్లో మగ్గుతుందన్న విషయం మీద ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అవి ప్రయోగశాలలో విచ్ఛిన్నం చెందితే ప్రకృతిలోనూ విచ్ఛిన్నమవుతాయి."
-లోట్,పరిశోధకుడు
మనిషి జీవన మనుగడలో వస్తున్న మార్పుల కారణంగా ముప్పు ఎదుర్కొంటున్న పర్యావరణాన్ని రక్షించాలంటే ఇలాంటి నూతన సాంకేతిక మార్పు తప్పనిసరి.