ETV Bharat / international

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు మళ్లీ షురూ

author img

By

Published : Sep 12, 2020, 8:08 PM IST

Updated : Sep 12, 2020, 8:43 PM IST

Oxford to resume trial of coronavirus vaccine it's creating with AstraZeneca, days after halt due to reported effect
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు మళ్లీ షురూ

20:25 September 12

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు మళ్లీ మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో వేయించుకున్న ఓ వాలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ప్రయోగాలు నిలిచిపోయాయి. బ్రిటీష్‌ రెగ్యులేటర్స్‌ నుంచి అన్ని అనుమతులూ రావడం వల్ల తిరిగి ప్రయోగాలు బ్రిటన్‌లో తిరిగి ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటనలో తెలిపింది.

వాలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బుధవారం ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. దీంతో ఈ వ్యాక్సిన్‌ భద్రతను సమీక్షించేందుకు ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటైంది. దర్యాప్తు చేసిన ఈ కమిటీ వ్యాక్సిన్‌ భద్రమేనని, ప్రయోగాలు ప్రారంభించొచ్చని మెడిసిన్స్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఏ)కి సిఫార్సు చేసింది. దీంతో ఎంహెచ్‌ఆర్‌ఏ నుంచి అనుమతులు రావడంతో ప్రయోగాలను తిరిగి ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ మూడోదశ​ ట్రయల్స్​ నిలిపివేత!

20:06 September 12

  • బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా కొవిడ్‌ టీకా ప్రయోగ పరీక్షలు పునరుద్ధరణ
  • ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ - ఆస్ట్రాజెనెకా ఆధ్వర్యంలో కొవిడ్‌ టీకా అభివృద్ధి
  • గత వారం బ్రిటన్‌లో ప్రయోగ పరీక్షలు నిలిపివేసిన ఆస్ట్రాజెనెకా
  • క్లినికల్ ట్రయల్స్‌లో వాలంటీర్ అనారోగ్యానికి గురికావడం వల్ల పరీక్షలు నిలిపివేత
  • సురక్షితమన్న ఎంహెచ్‌ఆర్‌ఏ నిర్ధరణతో ప్రయోగ పరీక్షలు పునరుద్ధరణ

Last Updated : Sep 12, 2020, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.