ETV Bharat / international

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ సురక్షితమే..

ప్రపంచ దేశాలు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న కరోనాకు వ్యాక్సిన్​ అందించే దిశగా మరింత పురోగతి సాధించింది ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ. తుది విడత ప్రయోగాల ఫలితాల్లో 70శాతానికిపైగా సమర్థతతో సురక్షితమేనని తేలింది.

Oxford/AstraZeneca vaccine safe and effective, latest study confirms
ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ భేష్​
author img

By

Published : Dec 9, 2020, 7:49 AM IST

కొవిడ్​-19కు రూపొందుతున్న టీకాల్లో తుది విడత క్లినికల్​ ప్రయోగాల ఫలితాలను ప్రచురించిన తొలి సంస్థగా ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. ఈ వివరాలను మంగళవారం ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్​లో ప్రచురించింది. ఫలితంగా వ్యాక్సిన్​ ఉత్పత్తి రేసులో కీలక అడ్డంకిని అధిగమించింది. ఈ వ్యాక్సిన్​ సురక్షితమేనని.. సగటున 70.4 శాతం సమర్థతను చాటిందని ఆ అధ్యయనం పేర్కొంది.

మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించిన మధ్యంతర విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ఈ ప్రయోగాల్లో 20వేల మందికిపైగా పాల్గొన్నారు. రెండు పూర్తిస్థాయి డోసులు పొందినవారిలో టీకా 62 శాతం సమర్థంగా పనిచేసిందని.. మొదట అరడోసు, ఆ తర్వాత పూర్తి డోసు తీసుకున్న వారిలో 90శాతం సమర్థత కనిపించిందని అధ్యయనం వెల్లడించింది.

ఇదీ చదవండి: 'కరోనాను ఎదుర్కొనే సమర్థత ఫైజర్​కు ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.