Omicron sub variant: ఒమిక్రాన్ అసలు వైరస్ కన్నా, దాని ఉప వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్ అసలు వేరియంట్(బీఏ1), దాని ఉప వేరియంట్(బీఏ2)ల వ్యాప్తి తీరు ఎలా ఉందన్న విషయమై స్టాటెన్స్ సీరం ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్ హేగన్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్‌ల పరిశోధకులు ఇటీవల దృష్టి సారించారు.
"ఒమిక్రాన్ అసలు వేరియంట్ వ్యాప్తి రేటు 29శాతం కాగా, బీఏ2 వ్యాప్తి రేటు ఏకంగా 39 శాతం నమోదైంది. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఉపవేరియంట్ సోకుతోంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి ఈ ముప్పుతో పాటు, ఇన్ఫెక్షన్ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది."
- శాస్త్రవేత్తలు
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన మరో పరిశోధనలోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడయ్యాయి. " ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా కొవిడ్‌కు గురై, స్వస్థత పొందినవారూ బూస్టర్ డోసు తీసుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ల నుంచి దీని ద్వారా రక్షణ లభిస్తుంది." అని పరిశోధకులు సూచించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ba2 omicron: బీఏ.2 వేరియంట్ కలకలం.. 54 దేశాల్లో కేసులు