ETV Bharat / international

సముద్రంలో కూరగాయలనూ పండించేస్తున్నారు..! - ఓషన్ ఫార్మింగ్ సాల్‌మార్‌

వానలు కురవడం లేదన్న దిగులుండదు.. ఒకవేళ ఎక్కువగా కురిసినా వరదలొస్తాయన్న చింత ఉండదు.. పంటకి తెగుళ్లొస్తాయని కానీ పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోందని కానీ ఆందోళన అక్కర్లేదు.. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏ పంట కావాలంటే ఆ పంట పండించొచ్చు.. ఎక్కడుందీ అలాంటి బంగారులోకం అంటే- సముద్రం లోపల.! అవును.. ఆ ఉప్పునీటిలోనే చేపలూ రొయ్యలతోపాటు కాయగూరలూ పండుతున్నాయి..!

oceans farming
సముద్రంలో పండించేస్తున్నారు..!
author img

By

Published : Jul 4, 2021, 9:42 AM IST

దాదాపు నూట నలభై ఏళ్ల క్రితం.. లండన్‌లోని సౌత్‌ కెన్సింగ్‌టన్‌ ప్రాంతంలో రాయల్‌ హార్టికల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో మత్య్సపరిశ్రమకు సంబంధించిన ప్రదర్శన జరిగింది. పెద్ద పెద్ద అక్వేరియంలు కట్టి ఏర్పాటుచేసిన ఆ భారీ ప్రదర్శనలో రకరకాల చేపల్నీ రొయ్యల్నీ ప్రదర్శించడమే కాక, వాటితో వంటలు చేసి విందు భోజనాలూ పెట్టారు. సముద్రంలో పెరిగే జలచరాలతో తయారైన ఆహారం అంటే ఇష్టపడేవారంతా ఆసక్తిగా సందర్శించడంతో ఆ ప్రదర్శన నిర్విరామంగా ఆర్నెల్లపాటు కొనసాగింది. ఆరోజుల్లోనే రోజుకు దాదాపు 20వేల మంది సందర్శించారట. అక్కడ ప్రదర్శించిన జలచరాల వివరాలూ, జరిగిన వ్యాపారమూ తదితరాలన్నిటితో ఒక పుస్తకాన్ని వెలువరించారు నిర్వాహకులు. అందులో ఒక మాట చెప్పారు వాళ్లు.. 'ఎకరం నేలకన్నా ఎకరం నీరు విలువైనది' అని చెప్పడమే తమ లక్ష్యమని ఆనాటి వాళ్ల లక్ష్యం ఇప్పుడు నిజమవుతున్నట్లే ఉంది. అప్పుడు వాళ్లు ఆ నీటిలో దొరికే మాంసాహారం గురించి మాత్రమే ఊహించారు కానీ ఇప్పుడు అక్కడ శాకాహారాన్నీ పండిస్తున్నారు. ఎందుకూ పనికిరాదనుకున్న ఉప్పునీరూ ఎంతో విలువైనదని చాటుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలూ, ప్రారంభమైన అంకుర పరిశ్రమలూ అందుకు నిదర్శనమైతే, ఈ పరిణామం ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపగలగడం అన్నిటికన్నా ముఖ్యమైన విశేషం.

  • భూమికీ నీటికీ ఇబ్బంది లేకుండా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం
  • పెరుగుతున్న జనాభా ఆకలి తీర్చడం
  • వాతావరణ మార్పుల్ని తగ్గించడం

...వీటన్నిటికీ ఒకటే పరిష్కారంగా 'ఓషన్‌ ఫార్మింగ్‌' మారబోతోంది అంటున్నారు పరిశోధకులు. ఆ కథాకమామిషు కాస్త చూద్దాం.

oceans farming
సముద్ర గర్భంలో పండించిన టమాటాలు..

ముప్పయ్యేళ్లలో..

ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరువలో ఉంది. మరో ముప్ఫై ఏళ్లకల్లా వెయ్యి కోట్లవుతుందని అంచనా. అంటే ఆహార ఉత్పత్తి కూడా ఆ స్థాయిలో పెరగాలి. కానీ అందుకు అవసరమైన వనరులేమో తగ్గిపోతున్నాయి. నీటి కరవు, సారహీనమైన నేల, క్రిమిసంహారకాలూ ఎరువుల రూపంలో రసాయనకాలుష్యం.. వెరసి ఆహార ఉత్పత్తికి ఆటంకాలవు తున్నాయి. మొత్తంగా భూమండలం మీద ప్రస్తుతం సాగుకు వాడుతున్న భూమి మూడు శాతమే. ఆ మూడుశాతంతోనే నానా అవస్థలూ పడుతూ పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాం కానీ, 70శాతం భూ ఉపరితలాన్ని ఆక్రమిస్తున్న నీటినేమో వృథాగా వదిలేస్తున్నాం. ఇది తెలివైన పని కాదంటున్నారు పరిశోధకులు. సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే సముద్రాలూ పంటపొలాలు కాగలవనీ, వాటి ద్వారా పోషకాలతో కూడిన ఆహార పంటల్ని పండించి ప్రజల ఆకలి తీర్చవచ్చనీ, దాంతో నీటి వనరుల మీద ఒత్తిడి తగ్గుతుందనీ, వేడెక్కుతున్న సముద్రాలూ ఈ పంటల వల్ల చల్లబడితే వాతావరణ మార్పుల్ని నిలువరించవచ్చనీ.. వారు వివరిస్తున్నారు. అయితే ఇప్పుడీ ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే..

oceans farming
సముద్రంలో పంట ప్రతీకాత్మక చిత్రం

మత్య్ససంపద తగ్గుముఖం

ఉప్పునీటిలోనైనా మంచినీటిలోనైనా అక్కడ పెరిగే రకరకాల జలచరాలను పట్టి తినడం మనిషికి వందల ఏళ్లుగా అలవాటే. అయితే తీరానికి దగ్గరగా దొరికినవాటితో తృప్తిపడి ఊరుకోలేదు అతడు. విశాలమైన సముద్రం మీదికి వేటకు వెళ్లాడు. ఏయే రకాలు ఎక్కడెక్కడ నివసిస్తాయో వాటి ఆనుపానులన్నీ కనిపెట్టాడు. గుడ్డు నుంచి పిల్ల వచ్చి పెరగడానికి ఎంత కాలం పడుతుందో లెక్కలేశాడు. ఏపుగా ఎదిగే సమయానికి కాపుకాసి, వలవేసి పట్టుకోవడం మొదలెట్టాడు. ఫలితం.. 1974లో 90శాతం అందుబాటులో ఉన్న మత్య్ససంపద 2017 నాటికి 65 శాతానికి పడిపోయింది. దాంతోపాటే సహజంగా సముద్రంలో ఉండాల్సిన వాతావరణమూ దెబ్బతింది. భూమి మీదా ఆహారోత్పత్తి తగ్గి, సముద్రంలోనూ తగ్గిపోతే- పెరిగే జనాభా ఆకలి తీరే మార్గమేదీ? ఈ నేపథ్యమే పలు కొత్త విధానాలకు ప్రాణం పోసింది. అక్వాకల్చర్‌, సీవీడ్‌ సాగులాంటివి కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు సాధారణ కూరగాయలూ పండ్లూ వరి లాంటి ధాన్యమూ పండించే విధానాలని కూడా అభివృద్ధి చేస్తున్నారు.

oceans farming
సముద్రం లోపల పంట పండిస్తున్న దృశ్యం

చేపల ఫారం

పంట పొలాలను చేపల చెరువులుగా మార్చడం తెలిసిందే. మాంసం కోసం కోళ్లనీ గొర్రెల్నీ ఫారాల్లో పెంచినట్లే చేపల్నీ రొయ్యల్నీ ఫారాల్లో పెంచడానికి దాదాపు వందేళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మెరైన్‌ లేబొరేటరీలూ, ఫిష్‌ హ్యాచరీలూ వచ్చాయి. నీటిలో పెరిగేవాటిని నేలమీద పెంచుతూ నేలను వృథా చేసుకోవడం ఎందుకనుకున్న నిపుణులు ఇప్పుడు సముద్రంలోనే ఆ పని చేస్తున్నారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం ఆహారరంగంలో ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం అక్వాకల్చర్‌. సహజంగా సముద్రంలో పెరిగే వాటికన్నా ఇలా ఫారాల్లో పెరుగుతున్నవే ఎక్కువట ఇప్పుడు.

oceans farming
ఓషన్‌ ఫార్మింగ్‌

ఇదంతా ఎలా మొదలైందంటే- 1933లో ఫుజినగ అనే జపాను శాస్త్రవేత్త సముద్రపు నీటిని ట్యాంకులో నింపి అందులో చిన్న చిన్న రొయ్యల్ని పెంచాడు. పాతికేళ్లపాటు అలా ప్రయోగాలు చేస్తూ అదే ట్యాంకులో 15 లక్షల రొయ్యలవరకూ పెంచగలిగాడు. అతడిని చూసి జపాను తీరప్రాంతాల్లో పలువురు అలాగే ట్యాంకుల్లో రొయ్యల్ని పెంచుతూ ఉపాధి పొందేవారు. 1959లో నార్వేలో ఇద్దరు సోదరులు సముద్రంలోనే వలని పంజరంలా కట్టి అందులో అట్లాంటిక్‌ సాల్మన్‌ రకం చేపల్ని పెంచే ప్రయత్నం చేశారు. కొంతకాలం సముద్రపు నీటిలోనూ తర్వాత నదిలోనూ పెరిగే ఈ చేపల్ని అచ్చం అదే పద్ధతిలో మొదట సముద్రంలో పెరగనిచ్చి తర్వాత వాటిని భూమిమీద మంచి నీటి ట్యాంకుల్లోకి మార్చి పెంచారు. పదేళ్లపాటు ప్రయత్నించి ఈ పద్ధతిలో చేపల దిగుబడి రెట్టింపు ఉంటోందని నిరూపించి పేటెంట్లూ తీసుకున్నారు. అప్పటికే సముద్రంలో సహజంగా దొరికే చేపల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో నార్వే ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా ఇప్పుడు అట్లాంటిక్‌ సాల్మన్‌ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో నార్వేనే మొదటి స్థానంలో ఉంది.

oceans farming
ఓషన్‌ ఫార్మింగ్‌

ఈ ప్రయోగాల స్ఫూర్తితో వేర్వేరు రకాల సముద్రపు చేపల్ని పెంచే ప్రయత్నాలు పలు దేశాల్లో మొదలయ్యాయి. 2017లో నార్వే కంపెనీ 'సాల్‌మార్‌' పెద్ద ఓషన్‌ ఫార్మ్‌ని ప్రారంభించింది. తీరానికి దూరంగా సముద్రంలో 68 మీటర్ల ఎత్తున, 110 మీటర్ల వెడల్పుతో కట్టిన ఈ ఫార్మ్‌లో ఒక్కో దఫాకి 15 లక్షల సాల్మన్‌ చేపల్ని పెంచవచ్చు. స్తంభాల్లాంటి నిర్మాణాల చుట్టూ వల కట్టి మధ్యలో ఈ చేప పిల్లల్ని వేస్తారు. సముద్రపు నీరే ఆ వలలోంచి ప్రవహిస్తుంటుంది కాబట్టి చేపపిల్లలు వాటికి సహజమైన ఆహారాన్ని ఆ నీటినుంచి గ్రహిస్తూ పెరుగుతాయి. బయటనుంచి పెద్ద చేపలు వాటిని తినేయకుండా వల కాపాడుతుంది. అలా పెరిగిన చేపల్ని ఓడల ద్వారా తీరానికి తీసుకొస్తారు. చైనా కూడా ఎల్లోసీ సముద్రంలో మూడు లక్షల చేపల్ని పెంచే సామర్థ్యం ఉన్న ఫిష్‌ ఫార్మ్‌ కట్టింది. ఇలా ఇప్పుడు ఎన్నో దేశాలు అక్వాకల్చర్‌ ఓషన్‌ఫార్మ్స్‌ని నిర్వహిస్తున్నాయి.

oceans farming
ఓషన్‌ ఫార్మింగ్‌

అవడానికి నాచు అయినా..

సీవీడ్‌.. సముద్ర జలాల్లో ఇప్పుడిదో సంచలనం. వాడుక భాషలో నాచుగా పేర్కొనే ఈ మొక్కల్లో కొన్ని వేల రకాలుంటాయి. 220 రకాలకు వాణిజ్యపరంగా చాలా విలువ ఉండగా పదిరకాల్ని ఎక్కువగా పెంచుతున్నారు. అన్నిటినీ కలిపి సీవీడ్‌గా వ్యవహరిస్తారు. ఇందులో కెల్ప్‌ అనే రకం ఒక్కరోజులోనే రెండడుగుల మేర పెరుగుతుంది. ఎండనుంచీ శక్తినీ, సముద్ర జలాలనుంచి పోషకాలనూ కార్బన్‌ డై ఆక్సైడ్‌నూ గ్రహించి నీటిలోపలే అడవుల్లా పెరుగుతాయి ఈ నాచుమొక్కలు. వీటిని పెంచేందుకు ఇప్పుడు తీరప్రాంతాల్లో పలు స్టార్టప్‌లు వెలశాయి. అలల తాకిడి తక్కువగా ఉండే తీరప్రాంతాలను ఎంచుకుని విత్తనాలు ఉంచిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ని ఒక తాడుతో కట్టి వరసగా నీటిలో వేలాడదీస్తారు. నీటి ఉష్ణోగ్రత, ఉప్పదనం సరిపోను ఉంటే చాలు. ఎలాంటి ఎరువులూ అక్కర్లేదు. 50 కిలోల విత్తనం వేస్తే దాదాపు ఐదురెట్లు దిగుబడి వస్తుంది. సీసాల్లోంచి మొలకెత్తిన మొక్కలు దండాల్లా కిందికి వేలాడుతూ పెరుగుతాయి. పూర్తిగా పెరిగాక సముద్రంలోంచి తీసి మిషన్లతో శుభ్రం చేస్తారు. కొన్నిటిని అప్పటికప్పుడు ప్రాసెస్‌ చేసి తాజా ఆహారపదార్థాల్లో వాడతారు. కొన్నిటిని ఎండబెట్టి పొడిచేసి చిరుతిళ్లు తయారుచేసే వ్యాపారస్తులకు సరఫరా చేస్తారు. మిగిలినదాన్ని పులియబెట్టి పశువుల దాణా తయారుచేసే కర్మాగారాలకు పంపిస్తారు.

oceans farming
ఓషన్‌ ఫార్మింగ్‌

ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్‌, పీచు లాంటివి పుష్కలంగా ఉండే ఈ నాచుకి పోషకాహారంగా డిమాండ్‌ చాలా ఎక్కువ. ఆహారంలోనే కాకుండా ఎరువులు, ఔషధాలు, టూత్‌పేస్టులు, కాస్మెటిక్స్‌, పెట్‌ ఫుడ్‌ తయారీల్లో వాడతారు. జీవ ఇంధనంగానూ ఉపయోగపడుతుంది. ఇండొనేషియాకి చెందిన స్టార్టప్‌ 'ఇవోవేర్‌' సీవీడ్‌ని ప్యాకేజింగ్‌కి వాడుతోంది. దీనితో ప్యాక్‌చేసిన ఆహారపదార్థాలను ప్యాకెట్‌తో సహా తినేయొచ్చు. సీవీడ్‌తో వాటర్‌ క్యాప్సూల్స్‌, స్ట్రాల తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని లాభాలున్న ఈ సీవీడ్‌ అటు పెరిగే టప్పుడూ కార్బన్‌డై ఆక్సైడ్‌ని పీల్చుకుని సముద్రంలో కాలుష్యాన్నీ తగ్గిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు కోట్ల టన్నుల సీవీడ్‌ని పండిస్తున్నారనీ దాని విలువ 42 వేల కోట్లు ఉంటుందనీ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ చెబుతోంది. మనదేశంలోనూ తీరప్రాంతాలైన ముంబయి, గుజరాత్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో సీవీడ్‌ని సాగుచేస్తున్నారు. ప్రస్తుతం 2500 టన్నులున్న ఉత్పత్తిని వచ్చే ఐదేళ్లలో ఏకంగా 11 లక్షల టన్నులకు పెంచే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. జలచరాలూ నాచూ లాంటివంటే సముద్రంలో సహజంగా పెరిగేవి. కాస్త ప్రయత్నంతో ఆధునిక సాంకేతికత సాయంతో వాటిని పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లగలిగారు. మరి మంచినీటితో తప్ప పెరగని కూరగాయలూ వరి లాంటివాటిని సముద్రంలో ఎలా పెంచుతున్నారన్నది ఇంకా ఆసక్తికరమైన విషయం.

అండర్‌వాటర్‌.. ఆకు కూరలు!

ఇటలీకి చెందిన 'ఓషన్‌ రీఫ్‌ గ్రూప్‌' అనే సంస్థ సముద్రం లోపల పనిచేసేవారికి అవసరమైన పరికరాలను తయారుచేస్తుంది. దాని యజమాని సెర్జియో గంబెరినికి స్కూబా డైవింగ్‌ అన్నా తోటపని అన్నా ఇష్టం. ఆ రెంటినీ కలుపుతూ ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిందతడికి. దాంతో 2012లో ఒక ప్రయోగం చేశాడు. గాలితో నింపిన ప్లాస్టిక్‌ గోళం లాంటిదాన్ని (బయోస్ఫియర్‌) తయారుచేసి తీరానికి కాస్త దగ్గరగా సముద్రంలో అడుగున గొలుసులతో బిగించాడు. గాలిలో పారాచూట్‌ తేలినట్లు నీటిలో తేలుతూ ఉండే ఆ బయోస్ఫియర్‌లో కుండీలను అమర్చి తులసి మొక్కలు నాటాడు. లోపలి గాలినీ కిందినుంచి నీటినీ గ్రహించి ఆ మొక్కలు చక్కగా పెరిగాయి. దాంతో మరుసటి సంవత్సరం ఇంకాస్త పెద్ద బయోస్ఫియర్స్‌ కట్టించి వేరే రకాల ఆకుకూరల్ని పెంచాడు. అక్కడ పెంచిన మొక్కల్నీ బయట నేలమీద పెంచిన మొక్కల్నీ శాస్త్రవేత్తల చేత పరీక్షచేయించాడు. రుచిలో ఏమాత్రం తేడా లేకపోగా పోషకాల దగ్గరికి వచ్చేసరికి సముద్రంలో పెంచిన మొక్కల్లో ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ శాతం ఎక్కువుందట. నేరుగా సూర్యరశ్మి సోకకపోయినా పోషకాల్లో లోపం లేదు. పైగా చీడపీడల్లాంటి ఎలాంటి ప్రతికూల వాతావరణమూ లేనందున మొక్కలు త్వరగా పెరుగుతున్నాయి. ఆ పరిశోధన ఇచ్చిన స్ఫూర్తితో సెర్జియో 'నెమోస్‌ గార్డెన్‌ ప్రాజెక్టు'ను విస్తరించాడు. 2015లో మిలాన్‌ ఎక్స్‌పోలో దీని వీడియోని ప్రదర్శించడంతో ప్రపంచానికి తెలిసింది.

oceans farming
సముద్రంలో పండించేస్తున్నారు..!

పూర్తిగా సాగుకు అనువైన వాతావరణంతో అక్కడ మొత్తం ఆరు పెద్ద పెద్ద బయోస్ఫియర్స్‌ ఉన్నాయిప్పుడు. 2000 లీటర్ల గాలి ఉండే ఒక్కో దాంట్లో 90కి పైగా మొక్కలు పెంచవచ్చు. బయటి, లోపలి నీటి ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల లోపల సముద్రపు నీరు ఆవిరవుతుంటుంది. అది బయోస్ఫియర్‌ పైన ఉపరితలానికి తగిలి చల్లబడి మంచినీరుగా మారుతుంది. ఆ నీటిని సేకరించి వాటికి పోషకాలను కలిపి తిరిగి మొక్కలకు వాడుతూ హైడ్రోపోనిక్స్‌ తరహా సాగు కూడా చేస్తున్నారు. రెండేళ్ల క్రితం పెనుతుపాను వచ్చి కొన్ని బయోస్ఫియర్స్‌ని ధ్వంసం చేసింది. వాటిని మరమ్మతుచేసి, మరింత దృఢంగా కట్టి మళ్లీ ఇటీవలే ప్రారంభించారు. సీజన్‌తో సంబంధం లేకుండా టొమాటోలూ పుట్టగొడుగులూ స్ట్రాబెర్రీలూ లాంటి మొత్తం వంద రకాల పంటల్ని ఇక్కడ పండిస్తున్నారు. వీటిని ప్రయోగశాల నుంచి శాస్త్రవేత్తలు ఇరవై నాలుగ్గంటలూ పర్యవేక్షిస్తుంటారు. లోపల ఉష్ణోగ్రతలు, వెలుతురు, గాలిలో తేమ, ఆక్సిజన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌ల స్థాయులతోపాటు బయట నీటి ఉష్ణోగ్రతతో సహా అన్నిటినీ గమనిస్తుంటారు. ఏవైనా మరమ్మతులు అవసరమైతే డైవింగ్‌లో శిక్షణ పొందిన వాళ్లు వెళ్లి సరిచేసి వస్తుంటారు. విత్తనాలు తప్ప ఏమీ తీసుకెళ్లకుండా సముద్రం నుంచి కూరగాయలూ పండ్లూ బయటకు తెస్తున్న నెమోస్‌ గార్డెన్‌ ప్రాజెక్టు శాస్త్రవేత్తలకు టూరిస్టు కేంద్రంలా మారింది. దీని స్ఫూర్తితో ఇతర దేశాల్లోనూ మరికొన్ని స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయనీ అవీ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించవచ్చనీ తెలుస్తోంది.

రేపో మాపో.. వరి!

కెనడాలో స్థిరపడిన బ్రిటిష్‌ యువకులు కొందరు కలిసి పెట్టిన స్టార్టప్‌ 'అగ్రిసీ' మరో అడుగు ముందుకేసి సముద్రం లోపల వరి పండించడానికి రంగం సిద్ధం చేస్తోంది. వరే ఎందుకూ అంటే- భూమి మీద ఉన్న మంచినీటిలో అధిక శాతాన్ని వరిపంట వాడేసుకుంటోందనీ ఒక కిలో వరి పండించడానికి రెండున్నర వేల లీటర్ల మంచినీరు అవసరమవుతోందనీ ఆ పంటని సముద్రంలో పండించుకోగలిగితే తాగునీటి సమస్య తలెత్తకుండా ఉంటుందనీ చెబుతున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకులు. అందుకుగాను వీళ్లు వరి విత్తనాలను ఉప్పునీటికి అలవాటు పడేలా జన్యుమార్పిడి చేయించారు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకు తగినట్లుగా మొక్కలు సహజంగానే కొన్ని లక్షణాలను మార్చుకుంటూ ఉంటాయి. అలాంటి మార్పునే కృత్రిమంగా చేయించామనీ ఇక ఇప్పుడు వాటిని నాటి పంట పండించడమే తరువాయి అని చెబుతున్నారు. దీనివల్ల అటు ఆహారం కొరతా తీరుతుంది, ఇటు సముద్రంలో కర్బన కాలుష్యమూ తగ్గుతుందన్నది వారి ఆలోచన, ఆశయం. భూమ్మీద మనుషుల వల్ల తయారవుతున్న కర్బనవాయువుల్లో మూడోవంతుని సముద్రాలు గ్రహిస్తున్నాయి. ఆ వాయువులు నానాటికీ పెరుగుతూనే ఉన్నందువల్ల సముద్రాలు ఇక గ్రహించలేని స్థితికి రావడానికి ఎంతో కాలం పట్టదు.

పైగా దానివల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరిగి వాటిలోని జీవవైవిధ్యమంతా దెబ్బతింటోంది. గత యాభై ఏళ్లలోనే ఆ ఉష్ణోగ్రతలు 90శాతం పెరగడం ఈ సమస్య తీవ్రతకు నిదర్శనం. దాన్ని నిలువరించడానికి ఇప్పుడు మన ముందున్న మార్గం సముద్రాలను సాగుకు వాడుకోవడం ఒక్కటేనంటున్నారు పరిశోధకులు. అటు ఆహారమూ ఇటు పర్యావరణమూ.. రెండు సమస్యలకీ ఒకటే పరిష్కారం అయినపుడు ఇక ఆలోచించడమెందుకని రంగంలోకి దిగిపోతున్నారు వ్యాపారవేత్తలు. ఈ పరిశోధనలూ పనులూ ఊపందుకుంటే- 'మేడ్‌ ఇన్‌ ఇండియన్‌ ఓషన్‌' అనో 'మేడిన్‌ బే ఆఫ్‌ బెంగాల్‌' అనో సూపర్‌మార్కెట్లో సరుకుల ప్యాకెట్లమీద కనపడే రోజు ఎంతో దూరం లేనట్లే..!

బంగ్లాదేశ్‌ చూపిన బాట!

భౌగోళికంగానే బాగా లోతట్టు ప్రాంతమైన బంగ్లాదేశ్‌ మూడింట రెండొంతులు తడినేల. గంగ, బ్రహ్మపుత్ర లాంటి పెద్ద నదులతో కలిపి దాదాపు 300 నదులున్నాయి ఆ చిన్నదేశంలో. వాటికి తోడు వాతావరణ మార్పుల కారణంగా తరచూ వచ్చే తుపాన్లూ వరదల వల్ల వ్యవసాయభూముల్లో బురద మేటలేసి సాగుకు వీల్లేకుండా చేస్తోంది. దాంతో మరో దారి లేక అక్కడి రైతులు 'ఫ్లోటింగ్‌ గార్డెన్స్‌' సాయంతో పంటలు పండించుకుంటున్నారు. నీటిమీద గుర్రపుడెక్క, ఎండుగడ్డి, వెదురు కర్రల సాయంతో బల్లకట్టుల్లాంటివి కట్టి; పైన మట్టి, ఆవు ఎరువులను పలుచగా పరుస్తారు. దానిమీద అన్ని రకాల కూరగాయలూ ఆకుకూరలూ పండిస్తున్నారు. ఒకవేళ వరద వచ్చి నీటి మట్టం పెరిగినా ఇవి తేలుతూనే ఉంటాయి కాబట్టి ఇబ్బందిలేదు. తక్కువ పెట్టుబడితో పేదల కడుపు నింపుతున్న ఈ ఫ్లోటింగ్‌ గార్డెన్స్‌ పర్యావరణానికి ఎలాంటి హానీ చేయకపోగా జీవ వైవిధ్యానికీ తోడ్పడుతున్నాయని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఈ విధానాన్ని సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.