బ్రిటన్ రాజకుటుంబానికీ కరోనా ముప్పు తప్పలేదు. ఆ దేశ యువరాజు చార్లెస్‌కు వైరస్ సోకింది. వైద్య పరీక్షలు నిర్వహించిన బ్రిటన్ ఆరోగ్య అధికారులు ఈ విషయాన్ని నిర్ధరించారు.
వైరస్ బారిన పడినప్పటికీ చార్లెస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చార్లెస్ సతీమణికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని తేలిందని వెల్లడించారు.