పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లో వివక్షకు గురైన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా కేంద్రం తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టంపై ఐరాస మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పౌరసత్వ చట్ట సవరణ.. ప్రాథమికంగా వివక్షపూరితంగా ఉందన్నారు సంఘం అధికార ప్రతినిధి జెరేమి లారెన్స్.
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ హక్కును బలహీనపరిచేలా ఈ చట్టం ఉందన్నారు లారెన్స్. జాతి, మత వివక్షను నిర్మూలించాలనే అంతర్జాతీయ తీర్మాణానికి ఇలాంటి చట్టాలు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
శరణార్థులకు రక్షణ కల్పించడాన్ని తాను స్వాగతిస్తున్నప్పటికీ.. జాతి, మత భేదాలు లేకుండా అందరినీ ఆదుకోవాలన్నారు. నూతన పౌరసత్వ చట్టాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం సమీక్షిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు లారెన్స్.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: బంగాల్లో రైల్వే స్టేషన్కు నిప్పు