ETV Bharat / international

ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కరోనా!

కరోనా వైరస్.. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది మాత్రం నోవెల్ కరోనా వైరస్-2019. ఈ వైరస్ కూడా వాతావరణం, మానవుల రోగ నిరోధక శక్తిని అనుసరించి జన్యు క్రమాన్ని మార్చుకుంటోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు కొవిడ్- 19కు చెందిన 3 వంశక్రమాలను గుర్తించినట్లు తెలిపారు.

CORONA VIRUS
ఊసరవెల్లిలా రంగులు మారుస్తోన్న కరోనా వైరస్!
author img

By

Published : Apr 10, 2020, 5:16 PM IST

కరోనా వైరస్​పై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర విషయాలను గుర్తించారు. చైనా వుహాన్ నుంచి ఐరోపా, అమెరికాకు విస్తరించిన ఈ వైరస్ అనేక మార్పులు చెందినట్లు గుర్తించారు. వుహాన్​లో బయటపడిన వైరస్​కు.... ఐరోపా, అమెరికా వాసుల్లో కనిపిస్తున్న వైరస్​కు చాలా తేడాలు ఉన్నాయని చెబుతున్నారు.

మూడు రకాలు..

కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం.. కొవిడ్- 19 మూడు వంశక్రమాలుగా పరివర్తనం చెందింది. వీటిని ఏ, బీ, సీలుగా గుర్తించారు.

మొదట కరోనా సోకిన 160 మంది నుంచి సేకరించిన వైరస్ జన్యువులను విశ్లేషించారు పరిశోధకులు. వీటినే కొత్త కరోనా వైరస్ 'సార్స్-కరోనావైరస్-2' వ్యాప్తికి కారకాలుగా గుర్తించారు. ఇవి పలు పరివర్తనలు చెంది వంశక్రమాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

"కరోనా వైరస్​లో వేగంగా అనేక మార్పులు జరిగాయి. వీటి వంశవృక్షాన్ని పరిశీలిస్తున్నాం. వీటిని డీకోడ్ చేసేందుకు గణిత అల్గారిథంను ఉపయోగిస్తున్నాం. ఈ పద్ధతిని డీఎన్ఏ ఆధారంగా మానవ క్రమాన్ని గుర్తించేందుకు వాడుతారు. కానీ కరోనా లాంటి వైరస్ ఎలా సంక్రమిస్తోందో తెలుకునేందుకు మొదటిసారి ఉపయోగిస్తున్నాం."

- పీటర్ ఫాస్టర్, జన్యు శాస్త్రవేత్త

ఇందుకోసం 2019 డిసెంబర్ 24 నుంచి 2020 మార్చి 4 వరకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ జన్యువులను సేకరించారు. వీటిపై పరిశోధనల అనంతరం పలు విషయాలను వెల్లడించింది ఫాస్టర్ బృందం.

గబ్బిలాల నుంచి తొలి రకం..

గబ్బిలాలలో గుర్తించిన కరోనా వైరస్ రకం 'ఏ'. ఈ రకమైన వైరస్ మొదట జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తించింది. వుహాన్​లో మొదట కనిపించిన వైరస్ కూడా ఇదే. కానీ ఆశ్చర్యకరంగా అదే నగరంలోని అనేక మంది బాధితుల్లో గుర్తించిన వైరస్ ఇది కాదు.

వుహాన్​లో నివసించిన అమెరికన్లలో కనిపించింది కూడా 'కరోనా-ఏ ' పరివర్తనమే. ఈ ఏ-రకం వైరస్ అమెరికా, ఆస్ట్రేలియా రోగుల్లోనే అధికంగా ఉన్నాయి.

వుహాన్ లో రెండో రకం..

వుహాన్​లో అధికంగా వ్యాపించింది బీ-రకం వైరస్. తూర్పు ఆసియా మొత్తం సంక్రమించింది ఇదే వైరస్. ఈ వైరస్ ఎక్కువగా ప్రయాణించకపోవటం వల్ల దీని పరివర్తనలు కొనసాగలేదు. దీని ఆధారంగా చూస్తే వుహాన్​లో పుట్టిన ఈ వైరస్.. తూర్పు ఆసియా వెలుపల జీవించలేకపోయినట్లు భావిస్తున్నారు పరిశోధకులు.

ఐరోపాకు మూడోది..

ఐరోపాను అతలాకుతలం చేస్తోన్న ప్రధాన వైరస్ రకం 'సీ'. ఫ్రాన్స్, ఇటలీ, స్వీడెన్, ఇంగ్లాండ్ లో తొలుత వ్యాపించిన వైరస్ రకం ఇదే. కానీ చైనాలో మాత్రం కనిపించలేదు. హాంకాంగ్, దక్షిణ కొరియాల్లో వ్యాపించింది.

ఇటలీ విషయాన్ని చూస్తే.. జనవరి 27న మొదటి కేసు నమోదైంది. జర్మనీ ప్రయాణికుడి నుంచి వ్యాపించింది. కానీ ఆ దేశానికి సింగపూర్ ద్వారా అధికంగా సంక్రమించింది.

వైరస్ వ్యాప్తికి మూలమిదే..

ఈ అధ్యయనం ద్వారా వైరస్ వల్ల భవిష్యత్ సంక్రమణ ఎలా ఉంటుంది? ఏ దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయాలను తెలుసుకోగలమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం ద్వారా.. 'ఏ-రకం' వైరస్ వ్యాప్తికి మూలమని నిర్ధరించారు. దీని నుంచి 'బీ-రకం' వైరస్ ఏర్పడి రెండు పరివర్తనలు చెందింది. 'బీ' నుంచి నుంచి 'సీ-రకం' పుట్టిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

వాతావరణాన్ని అనుసరించి..

ఈ విషయాన్ని గమనిస్తే.. కొత్త వారికి వ్యాప్తి చెందుతున్న క్రమంలో జన్యు వైవిధ్యాన్ని కోల్పోతాయి. అప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్న వైరస్​ల నుంచి కొన్ని ప్రత్యేక వైరస్ ఉత్పన్నమవుతాయి.

అంటే.. వుహాన్​లోని బీ-రకం వైరస్​కు తూర్పు ఆసియా వాతావరణం, రోగనిరోధక శక్తి అనుగుణంగా ఉంటుంది. అందువల్ల అక్కడ ఈ వైరస్ ఎక్కువ మందికి సంక్రమించగలిగింది. అయితే తూర్పు ఆసియా వెలుపల ఇది జీవించలేదు. ఫలితంగా జన్యుక్రమంలో మార్పులు జరిగాయి.

ఫాస్టర్, ఆయన బృందం చేసిన పరిశోధన.. వైరస్ వ్యాప్తి తొలిదశకే పరిమితం. వైరస్ విస్తరిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో వైరస్ రంగులు మార్చే అవకాశం ఉందని ఫాస్టర్ తెలిపారు. వాటిపై పరిశోధన చేయాలంటే.. సూపర్ నోవాను విశ్లేషించినట్లేనని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: ఆ 2 విషయాల వల్లే అమెరికాలో కరోనా చిచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.