ETV Bharat / international

ఐరోపాలో కాస్త తగ్గిన కరోనా ప్రభావం.. మరణాల్లో క్షీణత

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా తీవ్రత అధికంగా ఉన్న స్పెయిన్​, ఫ్రాన్స్​, ఇటలీ, యూకేల్లో మరణాలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో ఆసియాలో కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. టర్కీలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య 2 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు 24 లక్షలు మించాయి.

More than 1 million European cases of virus
ఐరోపా దేశాల్లో తగ్గిన కరోనా తీవ్రత.. మరణాల్లో క్షీణత
author img

By

Published : Apr 20, 2020, 6:27 AM IST

Updated : Apr 20, 2020, 6:32 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్​ ప్రభావం.. ఐరోపా దేశాల్లో క్రమంగా క్షీణిస్తోంది. కట్టుదిట్టమైన చర్యలు, ముందస్తు జాగ్రత్తల కారణంగా.. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. స్పెయిన్​లో ఆదివారం 410 మంది మరణించారు. ఫ్రాన్స్​, ఇటలీల్లోనూ వరుసగా 395, 433 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా చూస్తే ఇవి ఆయా దేశాల్లో కనిష్ఠ మరణాలు కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా 24 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షా 65 వేల మందికిపైగా ప్రాణాలు విడిచారు. 6 లక్షల 24 వేలకుపైగా కోలుకున్నారు.

జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం... అమెరికాలో 24 గంటల వ్యవధిలో 1997 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల కేసులు నమోదయ్యాయి.

ఐరోపాలో 10 లక్షలు దాటిన కేసులు...

కొవిడ్​ వైరస్​ ఐరోపాను అతలాకుతలం చేసింది. ఇక్కడ కేసులు 10 లక్షలను మించాయి. మరో లక్ష మందికిపైగా బలయ్యారు. స్పెయిన్​లోనే అత్యధికంగా లక్షా 98 వేలకుపైగా వైరస్​ బారినపడ్డారు. ఇటలీలో లక్షా 78 వేలు, ఫ్రాన్స్​లో లక్షా 52 వేలకుపైగా బాధితులున్నారు.

ఇటలీలో తగ్గుముఖం....

ఐరోపాలో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇటలీలో వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం అక్కడ కేవలం 433 మందే ప్రాణాలు కోల్పోయారు. ఈ వారంలోనే ఇది కనిష్ఠం. ఇప్పటివరకు దేశంలో 23 వేల 660 మందిని కరోనా బలితీసుకుంది. మరో 3047 మందికి వైరస్​ సోకింది.

అక్కడ కనిష్ఠం..

ఫ్రాన్స్ కనిష్ఠ మరణాలను ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 395 మంది మరణించారు. ఇందులో 227 మంది ఆసుపత్రుల్లో, 168 మంది నర్సింగ్​ హోంలలో చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 19 వేల 718 ఉన్నట్లు స్పష్టం చేశారు.

బ్రిటన్​లో ఆదివారం 596 మంది కొవిడ్​ కారణంగా మరణించారు. ఇక్కడ మొత్తం మరణాల సంఖ్య 16 వేల 60కి చేరింది. కొత్తగా 5 వేల 850 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 20వేలపైనే ఉంది. ఇక్కడి వృద్ధుల సంరక్షణాలయాల్లో మాత్రం కొవిడ్​ మృతుల సంఖ్య వారం వ్యవధిలోనే రెట్టింపై 2500కు చేరింది.

కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ క్రమేపీ అధికార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

మరో 410 మంది..

స్పెయిన్​లో మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆ దేశంలో ఇవాళ 410 మంది మరణించారు. మొత్తంగా స్పెయిన్​లో 20,453మంది కరోనాకు బలయ్యారు.

బెల్జియం, నెదర్లాండ్స్​లో ఆదివారం 230, 83 చొప్పున మరణించారు.

ఇరాన్​లో గడిచిన 24 గంటల్లో 87 కరోనా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,118 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు. ఇక్కడ వరుసగా ఆరోరోజూ 100లోపే మరణాలు నమోదైనా.. శనివారంతో పోలిస్తే 14 మంది అధికంగా మరణించారు.

టర్కీలో 2 వేలు ప్లస్​...

టర్కీలో మరో 127 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2 వేలు దాటింది. కొత్తగా దాదాపు 4 వేల మంది బాధితులు చేరారు. మొత్తం కేసులు 86 వేల పైమాటే.

పాకిస్థాన్​లో మరో 869 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,348కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. దాయాది దేశంలో ఇప్పటివరకు 168 మంది కరోనా కారణంగా మరణించారు. దేశవ్యాప్తంగా 98 వేల మందికిపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

జింబాబ్వేలో కరోనా లాక్​డౌన్​ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు అధ్యక్షుడు ఎమర్సన్​. దేశంలో మార్చి 30 నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 25 కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మరణించారు.

More than 1 million European cases of virus
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

Last Updated : Apr 20, 2020, 6:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.