ETV Bharat / international

వలసదారుల పడవ బోల్తా - 31 మంది మృతి - ఐరోపా వార్తలు తాజా

వలసదారుల పడవ బోల్తా కొట్టిన ఘటనలో 31 మంది (boat capsized) దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురుని అరెస్ట్​ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

boat capsized
వలసదారుల పడవ బోల్తా - 31 మంది మృతి
author img

By

Published : Nov 25, 2021, 5:25 AM IST

ఫ్రాన్స్​ నుంచి 34 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ (boat capsized) ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు బతికి బయటపడ్డారు. మరో వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్రాన్స్ నుంచి బ్రిటన్​కు వచ్చేందుకు వలసదారులు ఇంగ్లీష్​ ఛానెల్​ను దాటుతుండగా (boat capsized) బుధవారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అక్రమ రవాణాదారులుగా అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మృతుల్లో ఐదుగురు మహిళలు సహా ఓ బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఇరు దేశాల అధికారులు సంతాపం తెలిపారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఫ్రెంచ్​ అధికారులు (boat capsized) పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య బోటు సామర్థ్యానికి మించి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతిచెందిన వారిలో అఫ్గానిస్థాన్​, ఇరాక్​, ఎరిత్రియా, సూడాన్​ దేశాల నుంచి వచ్చిన శరణార్థులు ఉన్నారని తెలిపారు.

ఇంగ్లీష్​ ఛానెల్​ మీదుగా వలసదారుల రాకపోకలను పూర్తిగా కట్టడి చేసే దిశగా ఫ్రాన్స్​తో కలిసి పనిచేస్తామని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ అన్నారు.

ఇదీ చూడండి : బుర్కినా ఫాసోలో చెలరేగిన హింస.. 19మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.