ETV Bharat / international

'ఆ దేశ జనాభాలో 70% మందికి కరోనా!' - corona news

జర్మనీలో సుమారు 70 శాతం మంది కరోనా వైరస్​ బారిన పడతారని పేర్కొన్నారు ఆ దేశ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​. వైరస్​ వ్యాప్తిని అరికట్టడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.

Merkel: Virus will infect up to 70% of Germans
'జర్మనీలో 70 శాతం మంది ప్రజలకు కరోనా'​
author img

By

Published : Mar 11, 2020, 5:54 PM IST

జర్మనీలో కరోనా వైరస్​ వ్యాప్తిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​. నిపుణుల అంచనాలను ఉటంకిస్తూ.. దేశ జనాభాలో సుమారు 70 శాతం మంది ఈ మహమ్మారి బారిన పడొచ్చని తెలిపారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు.

బెర్లిన్​లో జరిగిన ఓ సమావేశంలో కరోనా వ్యాప్తిపై స్పందించారు మెర్కెల్​.

" వైరస్​ ఉన్నట్లయితే.. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ప్రజలకు ఈ వైరస్​ను తట్టుకునే రోగనిరోధక శక్తి లేదు. ఇప్పటి వరకు ఎలాంటి టీకాలు, చికిత్స లేదు. దేశంలోని జనాభాలో సుమారు 60-70 శాతం మంది ప్రజలు ఈ వైరస్​ బారిన పడతారని ఎక్కువ శాతం మంది నిపుణులు చెబుతున్నారు. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయటమే మా తొలి ప్రాధాన్యం. "

- ఏజెలా మెర్కెల్​, జర్మనీ ఛాన్సలర్​

1300 మందికి..

బుధవారం నాటికి జర్మనీలో 1,300 మంది ఈ వైరస్​ బారిన పడ్డారు. కరోనాతో ఇద్దరు మరణించారు. వెయ్యి మందికిపైగా హాజరయ్యే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకోవాలని ఇప్పటికే ప్రజలకు సూచించింది ప్రభుత్వం. నివారణ చర్యలు వేగవంతం చేసింది.

ఇదీ చూడండి: కరోనాను గుర్తించేందుకు ఆ 5 రోజులు చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.