ETV Bharat / international

పోలీసులపై కత్తితో దాడి- దుండగుడు హతం - ఫ్రాన్స్​లో కత్తి దాడి

పోలీసులపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి, కాల్పులకు పాల్పడిన ఘటన ఫ్రాన్స్​లో జరిగింది. భారీగా బలగాలు, స్నిఫ్ఫర్​ డాగ్స్​ సహా ఓ హెలికాప్టర్​ను రంగంలోకి దించి అతడ్ని పట్టుకుని హతమార్చారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి.

Stabbing on police officers
పోలీసులపై కత్తితో దాడి
author img

By

Published : May 28, 2021, 7:41 PM IST

ఓ మహిళా పోలీసు అధికారిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఇద్దరు పోలీసు అధికారులపై కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి పారిపోయిన దుండగుడి కోసం ఓ హెలికాప్టర్​ సహా వందల మంది పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని హతమార్చారు. ఈ ఘటన పశ్చిమ ఫ్రాన్స్​లోని ఓ పోలీస్​ స్టేషన్​లో జరిగింది.

దుండగుడి వివరాలు తెలుసుకుంటున్నట్లు ఫ్రాన్స్​ జాతీయ భద్రతా విభాగం తెలిపింది. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు గాయపడ్డారని, అయితే.. ప్రాణనష్టం తప్పిందని పేర్కొంది.

ఇదీ జరిగింది..

నాంటెస్​ శివారు లా చాపెల్లే-సుర్​-ఎర్డ్రేలోని పోలీస్​ స్టేషన్​లోకి ప్రవేశించిన దుండగుడు ఓ మహిళా అధికారిపై కత్తితో దాడి చేశాడు. ఆమె తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం ఓ హెలికాప్టర్​, స్నిఫ్ఫర్​ డాగ్స్​ సహా 200 మంది పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలోని పాఠశాలలు, దుకాణాల్లో సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే దుండగుడిని గుర్తించి, అరెస్ట్​ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులు జరిపాడు. ఇద్దరు అధికారులకు తూటాలు తగిలాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి.. మృతి చెందినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: గాజా వివాదంపై ఓటింగ్​కు భారత్​ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.