ETV Bharat / international

'10% కంటే తక్కువ మందిలోనే కరోనా​ యాంటీబాడీలు'

ప్రపంచ జనాభాలో 10శాతం కంటే తక్కువ మందిలోనే కరోనా వైరస్​ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు డబ్యూహెచ్​ఓ వెల్లడించింది. కేవలం వ్యాక్సినేషన్​ ద్వారానే హెర్డ్​ ఇమ్యూనిటీ సాధ్యం అని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆమోదించిన టీకాలు వైరస్​పై సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపింది.

Less than 10 pc of world's population have coronavirus antibodies: WHO Chief scientist
'10శాతం కంటే తక్కువ మందిలోనే వైరస్​ యాంటీబాడీలు'
author img

By

Published : Mar 1, 2021, 11:25 AM IST

కరోనా యాంటీబాడీలు.. ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం కంటే తక్కువ మందిలోనే ఉత్పత్తి అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్​ తెలిపారు. వాక్సినేషన్​తోనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం అన్నారు.

" ప్రపంచ జనాభాలో 10 శాతం కంటే తక్కువ మందికే యాంటీబాడీలు ఉన్నాయి. అధిక జనసాంద్రత ప్రాంతాల్లో వైరస్​ బారిన పడ్డ వారిలో 50-60శాతం మందికి యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. "

-- సౌమ్యా స్వామినాథన్, డబ్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆమోదించిన టీకాలు కొవిడ్​-19 వైరస్​పై సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు సౌమ్య. వైరస్​ లోడ్​ తక్కువగా ఉన్నా, లేక కరోనా వచ్చి లక్షణాలు లేని సందర్భాల్లో వ్యాక్సిన్​ల పనితీరుపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

జాన్​ హాప్​కిన్స్​ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 114 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు. 2.5 మిలియన్ల మందికిపైగా వైరస్​తో మరణించారు.

ఇదీ చదవండి : సింగిల్ డోస్​ టీకాకు చైనా అనుమతి- అమెరికాకు పోటీగానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.