కెనడా రచయిత్రి మార్గరెట్ ఎట్వుడ్, బ్రిటీష్ రచయిత్రి బెర్నార్డైన్ ఎవరిస్టో సంయుక్తంగా 2019 బుకర్ బహుమతిని గెలుచుకున్నారు.
లండన్లోని గిల్డ్హాల్ వేదికగా పీటర్ ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలోని న్యాయనిర్ణేతల బృందం ఈ మేరకు విజేతల పేర్లను ప్రకటించింది. 'ది టెస్టామెంట్' రచనకు ఎట్వుడ్, 'గర్ల్, ఉమన్, అదర్' రచనకు గానూ ఎవరిస్టోలకు ఈ అవార్డు లభించింది.
ఈ అవార్డు కింద 50 వేల పౌండ్ల నగదును ఇద్దరు రచయితలు సమంగా పంచుకోనున్నారు. లండన్ వేదికగా 1969 నుంచి ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. బుకర్ ప్రైజ్ నియమాలకు విరుద్ధంగా మరోసారి న్యాయనిర్ణేతలు ఇద్దరికి సంయుక్తంగా అవార్డును ప్రకటించారు. బుకర్ ప్రైజ్ అవార్డును ఇద్దరికి కలిపి ఇవ్వకూడదని 1992 సంవత్సరంలో నిర్ణయించారు. అయినప్పటికీ ఈ ఏడాది ఇద్దరి రచనలు పోటాపోటీగా నిలవడం వల్ల న్యాయనిర్ణేతలు ఇద్దరికీ సంయుక్తంగా అవార్డును ప్రకటించారు.
79 ఏళ్ల వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా ఎట్వుడ్, మొదటి నల్లజాతి మహిళగా బెర్నర్డైన్ రికార్డులకెక్కారు. ఎట్వుడ్ రెండోసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.