ETV Bharat / international

బ్రెగ్జిట్​ సరే... ఇప్పుడు యూకే నుంచి దేశాలు ఎగ్జిట్!

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ను సత్వరమే బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోన్న ప్రధాని బోరిస్ జాన్సన్​కు స్వదేశంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్రెగ్జిట్​ ప్రక్రియ సజావుగా సాగుతున్నప్పటికీ యునైటెడ్ కింగ్​డమ్​లోని దేశాలైన స్కాట్లాండ్, నార్తన్ ఐర్లాండ్ ఈ ప్రక్రియపై సానుకూలంగా లేకపోవడం ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. దీంతో యూకే నుంచి ఆయా దేశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Johnson's win may deliver Brexit but could risk UK's breakup
బ్రెగ్జిట్​ సరే... ఇప్పుడు యూకే నుంచి దేశాలు ఎగ్జిట్!
author img

By

Published : Dec 15, 2019, 5:46 AM IST

Updated : Dec 15, 2019, 7:06 AM IST

ఐరోపా సమాఖ్య నుంచి​ వైదొలగడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బోరిస్ జాన్సన్​ ముందు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలో విజయంతో బ్రెగ్జిట్​కు మార్గం సుగమమైనప్పటికీ... యూకేలోని స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్​లు బ్రిటన్​ నుంచి విడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బ్రెగ్జిట్​పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో స్కాట్లాండ్, ఐర్లాండ్​లు బ్రెగ్జిట్​కు అనుకూలంగా ఓటేయలేదు. అంతేగాక తాజా ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ కాకుండా అక్కడి స్థానిక పార్టీలకు ఆధిక్యం రావడమూ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బోరిస్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాల్లో గెలుపొందింది. అందులో 345 స్థానాలు ఇంగ్లాండ్ నుంచి కాగా.... కేవలం 20 స్థానాలను ఇతర యూకే దేశాల్లో గెలుపొందింది.

స్కాటిష్​ నేషనల్ పార్టీ హవా

స్కాట్లాండ్​లో 59 సీట్లకు 48 స్థానాలను 'స్కాటిష్ నేషనల్ పార్టీ' గెలుపొందింది. ఈ పార్టీ బ్రెగ్జిట్​కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేగాక యూకే నుంచి స్కాట్లాండ్​కు స్వాతంత్ర్యం కోరుకుంటోంది. ఎన్నికల్లో పార్టీ ఘన విజయంతో స్కాట్లాండ్ వాసుల కోరికలు ఇతర యూకే వాసుల కోరికలకంటే భిన్నమైనవనే విషయం స్పష్టమైందని అన్నారు స్కాటిష్ పార్టీ నేత నికోలా స్టర్జన్​.

యూకే నుంచి బయటకు వచ్చే అంశమై 2014లో స్కాట్లాండ్​లో రిఫరెండం నిర్వహించగా... ఇందులో యూకేలో ఉండటానికే 55 శాతం మంది మద్దతిచ్చారు. అయితే బ్రెగ్జిట్ పరిణామాల వల్ల పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, ఇష్టంలేకపోయినా ఐరోపా సమాఖ్య నుంచి స్కాట్లాండ్ వైదొలిగే పరిస్థితి ఉందని స్కాటిష్ పార్టీ చెబుతోంది. ఈయూ నుంచి వైదొలిగే అంశంపై స్కాట్లాండ్ స్వతంత్రంగా నిర్వహించుకునే రిఫరెండం ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలనంటోంది.

అయితే 2014 రిఫరెండం నిర్ణయాత్మకమైనదని, దాన్ని గౌరవించాలని ప్రధాని బోరిస్ జాన్సన్.. స్కాటిష్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దీంతో ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. యూకే ప్రస్తుతం రాజ్యాంగపర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే యూకే ప్రభుత్వ ఆమోదం లేకుండా స్వతంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం చెల్లదు. వాటి ఫలితాలను సైతం యూకే లెక్కచేయదు. వాటిని చట్టబద్ధంకాని రిఫరెండంలుగానే పరిగణిస్తారు.

ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్​ మాత్రం రెండో రిఫరెండం ప్రతిపాదన లేదని తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ కాలం ముగిసే వరకు (2024) మరో రిఫరెండం ఉండబోదని స్పష్టం చేశారు. దీంతో రిఫరెండం ఏర్పాటు చేయడానికి స్టర్జన్​కు న్యాయపరమైన మార్గం లేకుండా పోయింది. అయితే తాజా ఎన్నికల్లో మోస్తరు స్థానాలు గెలిచిన స్కాటిష్ పార్టీ... తమ గళాన్ని వినిపించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. రిఫరెండంపై బోరిస్ జాన్సన్ ఎంత ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే... అంతే తీవ్రతతో స్కాట్లాండ్ స్వతంత్ర్య సంగ్రామం జరుగుతుందని ప్రముఖ చరిత్రకారుడు, ఎడిన్​బర్గ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ టామ్​ డివైన్ అన్నారు.

నార్తన్ ఐర్లాండ్​లోనూ...

నార్తన్ ఐర్లాండ్​లోనూ యూకే వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ఐర్లాండ్​ ద్వీపంలోని ఓ భాగమే ఈ నార్తన్ ఐర్లాండ్. తాజా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల్లో ఐర్లాండ్​లో చేరడానికి మద్దతిచ్చేవారే ఎక్కువగా ఉన్నారు.

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వస్తే ఈ రెండు ప్రదేశాల మధ్య సరిహద్దు సమస్యలు తలెత్తుతాయి. రెండు ప్రాంతాలు ఒకటి ఐరోపా సమాఖ్యలో మరొక ప్రాంతం యూకేలో ఉంటుంది. దీంతో యూకేకు, నార్తన్ ఐర్లాండ్​కు మధ్య సరిహద్దు ఏర్పాటు చేస్తే... ఆర్థిక విషయాల్లో నార్తన్ ఐర్లాండ్ పూర్తిగా ఐర్లాండ్​లో కలిసిపోయే అవకాశం ఉందని రాయబారి జొనాథన్ పావెల్ అభిప్రాయపడ్డారు. 1998లో కుదిరిన నార్తన్ ఐర్లాండ్ శాంతి ఒప్పందానికి జొనాథన్ పావెల్ సహకరించారు. నార్తన్​ ఐర్లాండ్​ రాజకీయంగా కూడా ఐర్లాండ్​లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నట్లు పావెల్ తెలిపారు. రాబోయే పదేళ్లలో సంయుక్త ఐర్లాండ్ ఆవిర్భవించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈ ఫోన్లలో డిసెంబర్​ 31 తర్వాత వాట్సాప్​ బంద్​

New Delhi, Dec 14 (ANI): Jawaharlal Nehru University (JNU) Vice-Chancellor M Jagadesh Kumar's car was allegedly attacked by students inside university premises on December 14. "I was attacked today. I had gone to visit School of Arts and Aesthetics, JNU where around 10-15 students surrounded me. They were trying to pull me down and in a mood to attack me. Fortunately, I was rescued by security and managed to escape," said JNU VC.
Last Updated : Dec 15, 2019, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.