ETV Bharat / international

'అప్పుడు నా మరణవార్తకు ప్రణాళికలూ సిద్ధం!'

కరోనా బారినపడి కొద్దివారాల అనంతరం కోలుకున్న బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ భావోద్వేగంగా మాట్లాడారు. ఆస్పత్రిలో తాను దురదృష్టవశాత్తు మరణిస్తే.. వార్తను బయటి ప్రపంచానికి ఎలా చెప్పాలో వైద్యులు ముందస్తు ప్రణాళికలు కూడా చేసుకున్నట్లు వెల్లడించారు బోరిస్​. గద్గద స్వరం, చెమర్చిన కళ్లతో చికిత్స సమయం నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.

Johnson's virus fight: Britain made contingency plans in case he dies
అప్పుడు నా మరణవార్తకు ప్రణాళికలూ సిద్ధం..!
author img

By

Published : May 3, 2020, 3:58 PM IST

కొవిడ్-19 సోకి ఆస్పత్రిలో చేరిన సమయంలో.. దురదృష్టవశాత్తూ తాను మరణిస్తే ఆ వార్తను బయటి ప్రపంచానికి చెప్పేందుకు వైద్యులు ముందే సిద్ధమైనట్లు వెల్లడించారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

కరోనా వైరస్ బారినపడి ఏప్రిల్‌ 5న లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఏప్రిల్‌ 12న తిరిగొచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో కష్టంగా గడిచిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు బోరిస్​. దాదాపు మరణం అంచుల వరకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. 'ది సన్‌'కి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నా పరిస్థితిలో పురోగతి లేనందున..

''వైద్యులు లీటర్ల కొద్దీ ఆక్సిజన్‌ ఖర్చుచేస్తున్నారు. అయినా, ఎలాంటి పురోగతి కనిపించకపోయే సరికి.. పరిస్థితులు చేదాటిపోతే ఆ విషయాన్ని ఎలా బయటకు చెప్పాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అది నాకు అర్థమవుతూనే ఉంది. అవన్నీ చేదు జ్ఞాపకాలు'' అంటూ గద్గద స్వరం, చెమర్చిన కళ్లతో బోరిస్‌ నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.

వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ని..

''కొన్ని రోజుల్లోనే నా ఆరోగ్యం అంతలా ఎలా క్షీణించిందో అంతుబట్టలేదు. అంతా చికాకుగా అనిపించింది. ఎందుకు కోలుకోలేకపోతున్నానో నాకే అర్థం కాలేదు. ఇక నా వాయునాళంలో ప్రత్యేక ట్యూబ్‌ అమర్చుదామా.. అనే వరకు వెళ్లింది. ఇక అప్పుడు పరిస్థితి చేదాటిపోతే ఎలా అని వైద్యుల ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను ఉద్వేగానికి లోనవుతున్నాను. కానీ, అలాంటి పరిస్థితుల నుంచి కూడా నన్ను తిరిగి మామూలువాణ్ని చేసిన ఘనత వైద్యులకే దక్కుతుంది. ఆస్పత్రిలో నాపై తీసుకున్న శ్రద్ధ మాటల్లో చెప్పలేనిది. అద్భుతంగా పనిచేసిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ని'' అంటూ వైద్యులు చేసిన సేవల్ని కొనియాడారు.

తన చికిత్సలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వైద్యులకు గుర్తుగా.. తన కుమారుడికి వారి పేరుతో నామకరణం చేశారు జాన్సన్​.

అయినా, సడలని విశ్వాసం..

''గతంలో అనేక సార్లు నేను గాయపడ్డాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. అంతా గందరగోళంగా అనిపించింది. ఆస్పత్రికి చాలా మంది వస్తున్నారు. కోలుకొని వెళ్లిపోతున్నారు. నేను మాత్రం ఎందుకు కోలుకోలేకపోతున్నానో అర్థమయ్యేది కాదు. దీనికి చికిత్స లేదు. ఇప్పుడు దీన్నుంచి ఎలా బయటపడేది అని ఆలోచిస్తూ ఉండేవాణ్ని. అయినా, త్వరలో అంతా సర్దుకుపోతుందని నాకు బలంగా అనిపించేది'' అని చికిత్స సమయంలో సడలని తన విశ్వాసాన్ని బోరిస్‌ వివరించారు.

బోరిస్‌.. ఇప్పుడు ఓ మారిన మనిషి

కరోనా వల్ల ఆరోగ్యపరంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొన్న బోరిస్‌ జాన్సన్‌లో చాలా మార్పు వచ్చిందని ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన డేవిడ్‌ వూడింగ్‌ తెలిపారు.

''ఏళ్లుగా నేను బోరిస్‌ను కలుస్తున్నాను. అనేక సార్లు ఇంటర్వ్యూ కూడా చేశాను. కానీ, ఈసారి చేసింది వాటన్నికంటే చాలా ప్రత్యేకమైనది. నిబంధనల మేరకు ఇంటర్వ్యూ సమయంలో భౌతిక దూరం పాటించినప్పటికీ.. మరణంతో పోరాడిన ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది.'' అని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.