బ్రిటన్లో ఇంటికే పరిమితం కావాలన్న లాక్డౌన్ నిబంధనలు డిసెంబర్ 2తో ముగుస్తాయని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కొవిడ్ వింటర్ ప్లాన్ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగతుందని స్పష్టం చేశారు. లాక్డౌన్ బదులు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఆధారంగా మూడంచెల విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
తక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాలను టైర్-1, మధ్యస్థ రిస్క్ ఉన్న ప్రాంతాలను టైర్-2, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను టైర్-3గా విభజించనున్నట్లు తెలిపారు.
మూడంచెల విధానం ఇలా..
టైర్ 1,2లలో నిబంధనలకు లోబడి ఇతర వ్యక్తులను కలిసేందుకు అనుమతులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పబ్లు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల తర్వాత మూసేయాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో క్రీడా కార్యక్రమాలకు అనుమతులు ఉంటాయి.
టైర్ 3 ప్రాంతాల్లో మాత్రం బయట ఇతర వ్యక్తులను కలిసేందుకు అనుమతులు ఉండవు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు. టేక్ అవేలు తప్పా రెస్టారెట్లు, పబ్లు తెరిచేందుకు అనుమతులు ఉండవు.
ప్రతి 14 రోజులకు ఓ సారి ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను సమీక్షించి.. వాటి స్థితిని మార్చనున్నారు.
ఇదీ చూడండి:ఆశాకిరణంగా ఆక్స్ఫర్డ్ టీకా- 70 శాతం సమర్థత