ఇటలీలో కరోనా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. కరోనా మరణాల్లో ఇప్పటికే చైనాను దాటేసిన ఇటలీలో రోజురోజుకు వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అక్కడ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ మహమ్మారి మాత్రం పంజా విసురుతూనే ఉంది.
ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 627 మంది వైరస్ ధాటికి బలయ్యారు. ఇప్పటివరకు ఈ దేశంలో 4,032మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడివారిన సంఖ్య 47,021కు పెరిగింది. అంతకుముందు మంగళవారం 300పైగా.. బుధవారం 475మంది మరణించారు.