ETV Bharat / international

ఇటలీలో మళ్లీ పెరిగిన మృతుల సంఖ్య - కరోనా వైరస్​ మృతులు

ఇటలీలో రోజువారీ మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా 636 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 16,525కు చేరింది. ఆదివారం 525మంది ప్రాణాలు కోల్పోవడం.. తాజాగా ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్​లో మృతుల సంఖ్య 5వేలు దాటింది.

Italy's virus deaths rise to 636 after big drop
ఇటలీలో మళ్లీ పెరిగిన మృతుల సంఖ్య
author img

By

Published : Apr 6, 2020, 11:23 PM IST

కరోనా వైరస్​తో ఇటలీలో తాజాగా 636మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16వేల 523కు చేరింది. అయితే ఆదివారం(525)తో పోల్చితే మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటలీలో కరోనా పాజిటివ్​ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 3వేల 599మంది వైరస్​ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 1,32,547 కేసులు నమోదయ్యాయి.

బ్రిటన్​లో...

బ్రిటన్​లోనూ కరోనా వైరస్​ విజృంభిస్తోంది. స్థానిక కాలామానం ప్రకారం.. ఏప్రిల్​ 5, సాయంత్రం 5 గంటల వరకు మృతుల సంఖ్య 5వేలు దాటింది. 439 తాజా మరణాలతో ఇప్పటి వరకు మొత్తం 5వేల 373మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో మరో 3వేల 802మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 51వేల 608కి చేరింది.

'ఇదే అతిపెద్ద పరీక్ష...'

ఐరోపా సమాఖ్య చరిత్రలోనే.. ఈ కరోనా వైరస్​ మహమ్మారి అతిపెద్ద పరీక్ష అని జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కల్​ అభిప్రాయపడ్డారు. ప్రాణాంతక వైరస్​ను ఎదుర్కొనేందుకు జర్మనీ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఐరోపా దేశాలకు తెలిపారు.

ఇదీ చూడండి:- నాలుగో రోజూ స్పెయిన్​లో తగ్గిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.