ETV Bharat / international

కాంగోలో ఇటలీ రాయబారి కాల్చివేత - ఇటలీ భారత్​ సంబంధాలు

కాంగోలో ఇటలీ రాయబారి హత్యకు గురయ్యారు. గోమా పట్టణంలో ఐరాస వాహనంలో ప్రయాణిస్తోన్న ఆయనతో పాటు పోలీసు అధికారిని దుండగులు సోమవారం కాల్చి చంపారు.

Italian ambassador killed in Congo while in UN convoy
కాంగోలో ఇటలీ రాయబారి కాల్చివేత
author img

By

Published : Feb 22, 2021, 6:34 PM IST

కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్యకు గురయ్యారు. రాజధానికి పశ్చిమాన ఉన్న గోమా పట్టణంలో ఐరాస వాహన శ్రేణిలో ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇటలీ రాయబారి లూకా అట్టాన్సియో సహా మరో కాంగో పోలీసు అధికారి మరణించారని ఇటలీ విదేశాంగ శాఖ తెలిపింది.

సహజ వనరులు పుష్కలంగా ఉన్న కాంగోలో అంతర్యుద్ధం, హింస నిత్యకృత్యం. ఈ నేపథ్యంలో శాంతిస్థాపనకు ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది. అయితే.. ఈ చర్యలను సహించని కొన్ని తిరుగుబాటు బృందాలు.. దాడులు చేస్తూ అంతర్జాతీయ ప్రముఖులను హత్య చేస్తున్నాయనే వాదనలు ఉన్నాయి.

ఇదీ చదవండి: మయన్మార్​లో అలజడి- ఐరాస ఉన్నత స్థాయి భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.