గల్ఫ్ జలాల్లో ప్రయాణిస్తున్న బ్రిటిష్ చమురు ఓడకు ఇరాన్ ఓడలు ఆటంకం తలపెట్టాయని బ్రిటన్ ప్రభుత్వం ఆరోపించింది. అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా మూడు ఇరానియన్ ఓడలు బ్రిటిష్ హెరిటేజ్ వాణిజ్య నౌకను అడ్డుకున్నాయని తెలిపింది. హొర్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఘటన జరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది.
యుద్ధ నౌక జోక్యం చేసుకుని ఇరాన్ ఓడలు అడ్డుతప్పుకోవాలని హెచ్చిరించాక అవి వెనుదిరిగాయని పేర్కొంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇరాన్ ప్రభుత్వానికి సూచించినట్లు బ్రిటన్ తెలిపింది.
హొర్ముజ్ జలసంధి వద్ద చమురు నౌకలపై గతంలో దాడులు జరిగాయి. దాడి చేసింది ఇరాన్ దేశమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించగా.. ఇరాన్ ఖండించింది.
ఇదీ చూడండి: 'గ్రీన్‌కార్డ్ బిల్లు'కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం