ETV Bharat / international

'అంతర్జాలం మహిళ కోసం పని చేయడం లేదు!' - టిమ్ బెర్నర్స్ లీ

వరల్డ్ వైడ్ వెబ్ సృష్టి కర్త టిమ్​ బెర్నర్స్ లీ.. అంతర్జాలంలో మహిళలపై కొనసాగుతున్న వివక్షపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్​ ఆడపిల్లల కోసం పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది లింగ సమానత్వ భావనను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

Internet inventor warns web not working for women: Tim Berners Lee
అంతర్జాలం మహిళ కోసం పని చేయడం లేదు: టిమ్ బెర్నర్స్ లీ
author img

By

Published : Mar 13, 2020, 6:59 AM IST

అంతర్జాలం మహిళల కోసం పనిచేయడం లేదన్నారు వరల్డ్​ వైడ్ వెబ్​ సృష్టికర్త టిమ్ బెర్నర్స్​ లీ. కానీ అదే ఇంటర్నెట్​ ఆడపిల్లలపై వివక్షకు మరింత ఆజ్యం పోస్తోందని హెచ్చరించారు. వరల్డ్ అసోసియేషన్​ ఆఫ్ గర్ల్​ గైడ్స్ అండ్​ గర్ల్​ స్కౌట్స్ చేసిన సర్వేను ఊటంకిస్తూ బెర్నర్స్ లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

"వెబ్​ మహిళలు, బాలికల కోసం పనిచేయడం లేదు. సగానికి పైగా మహిళలు, బాలికలు ఆన్​లైన్​ హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా రంగు, రూపం ఆధారంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎల్​జీబీటీక్యూ, ఇతర అట్టడుగు వర్గాల పురోగతికి కూడా ఇది అవరోధంగా నిలుస్తోంది."- టిమ్​ బెర్నర్స్ లీ, వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త

అందరికీ ఉచిత, ఓపెన్ వెబ్​ సౌకర్యం అందుబాటులో ఉండాలనేది... బెర్నర్స్ లీ స్థాపించిన వరల్డ్ వైడ్​ వెబ్ ఫౌండేషన్ ఆశయం. మహిళలను కించపరచడానికి అంతర్జాలాన్ని దుర్వినియోగపరచడం చాలా 'ప్రమాదకరమైన ధోరణి' అని, ఇది లింగ సమానత్వ భావనను దెబ్బతీస్తుందని బెర్నర్స్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: భారత్​లో తొలి కరోనా వైరస్​ మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.