రష్యాలోని కజాన్‌లో జరిగిన 45వ అంతర్జాతీయ నైపుణ్యాల పోటీల్లో భారత్ సత్తా చాటింది. ఒక స్వర్ణంతో పాటు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. 2007 నుంచి భారత్ ఈ పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. 2017లో ఒక రజతం గెలుచుకోగా...ఈ ఏడాది అత్యధిక పతకాలు సొంతం చేసుకుంది.
పతకాలు సొంతమయ్యాయిలా..
ఒడిశాకు చెందిన 'అశ్వత్ నారాయణ' నీటి సాంకేతికతలో స్వర్ణం సాదించారు. వెబ్ సాంకేతికతలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 'నూతలపాటి ప్రణవ్' రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక బంగాల్‌కు చెందిన 'సంజోయ్ ప్రమాణిక్' నగల తయారీలో, మహారాష్ట్రకు చెందిన 'శ్వేత రత్న పుర' గ్రాఫిక్ డిజైన్ విభాగాల్లో చెరో కాంస్యం గెలుపొందారు.
వరల్డ్ స్కిల్స్ కజాన్ 2019 పోటీల్లో 63 దేశాలు పాల్గొన్నాయి. ఆగస్టు 22న జరిగిన ప్రారంభోత్సవానికి దాదాపు రెండున్నర లక్షల మంది హాజరయ్యారు.
ఇదీ చూడండి:ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు