ETV Bharat / international

కొవిడ్​ నియంత్రణకు కొత్త విధానం! - స్పై బయోటెక్​

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్​ కోసం ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్​-19ను అరికట్టేందుకు నూతన విధానం దిశగా అడుగులు వేస్తోంది స్పై బయోటెక్​. ఇందుకోసం సీరం ఇన్​స్టిట్యూట్​తో జట్టుకట్టింది.

Covid-19 vaccine
కొవిడ్​ అదుపునకు కొత్త విధానం!
author img

By

Published : Sep 9, 2020, 7:31 AM IST

కొవిడ్​-19ను అరికట్టేందుకు నూతన విధానం దిశగా అడుగులు పడుతున్నాయని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయానికి చెందిన స్పై బయోటెక్​ కంపెనీ ప్రకటించింది. నావెల్​ వైరస్​ లాంటి కణ వ్యాక్సిన్​ (వీఎల్​పీ) విధానం అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే సీరం ఇన్​స్టిట్యూట్​ ప్రయోగాత్మక పరీక్షలు ప్రాంభించిందని స్పైబయోటెక్​ సీఈఓ ప్రొఫెసర్​ సుమీ బిస్వాస్ తెలిపారు.

''ఆస్ట్రేలియాలో జరిగిన పరిశోధన ఆధారంగా స్పై బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ల మద్య ప్రపంచవ్యాప్తంగా లైసెన్సింగ్​ ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థల మధ్య జరిగిన కీలక ఒప్పందం ద్వారా సురక్షిత పద్ధతిలో, భారీ స్థాయిలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ డోస్​లను తయారు చేసే అవకాశం లభిస్తుంది. వీఎల్​పీని అభివృద్ధి చేసేందుకు స్పై బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ కలిసి పని చేయటం ప్రస్తుత క్లిష్ట సమయంలో కీలక ముందడుగు.''

- సుమీ బిస్వాస్, స్పై బయోటెక్​ సీఈఓ

నూతన విధానంతో వేగంగా, సురక్షితంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు కీలకంగా మారనుందని తెలిపారు బిస్వాస్​.

ఇదీ చూడండి: సురక్షితమైన వాక్సిన్​కు ఔషధ సంస్థల ప్రతిజ్ఞ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.