గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఎంపికైన నలుగురు భారతీయ వ్యోమగాములు రష్యాలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నారు. జ్వ్యోజ్డ్నీ గొరోడోక్ నగరంలోని గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్ సెంటర్లో ఈ శిక్షణ పూర్తైంది. 'శిక్షణ పూర్తి చేసుకున్న భారతీయ వ్యోమగాములతో సాయంత్రం సమావేశమయ్యాం. భవిష్యత్ స్పేస్ ప్రాజెక్టుల విషయంపై భారతీయ రాయబారులతోనూ చర్చించామ'ని రష్యా స్పేస్ ఏజెన్సీ హెడ్ ద్మిత్రి రోగోజిన్ తెలిపారు.
గగన్‌యాన్‌కు ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ కోసం రష్యాలోని గ్లావ్కోస్మోస్ సర్వీస్ ప్రొవైడర్‌తో 2019 జూన్‌లో ఇస్రో ఒప్పందం చేసుకుంది. భారతీయ వాయుసేనకు చెందిన నలుగురు పైలట్లను ఇందుకోసం రష్యాకు పంపించింది. 2020 ఫిబ్రవరి 10న శిక్షణ ప్రారంభం కాగా.. కరోనా కారణంగా ట్రైనింగ్‌కు మధ్యలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది.
రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత్‌లోనూ వీరికి శిక్షణ అందనుంది. ఇస్రో డిజైన్ చేసిన సర్వీస్ మాడ్యూల్లో వీరు ట్రైనింగ్ పొందనున్నారు.
ఇదీ చదవండి: గగన్‌యాన్ వ్యోమగాముల ల్యాండింగ్ అక్కడేనా!