బ్రిటన్ టెక్ వీసాల దరఖాస్తుల్లో భారత్, అమెరికా ముందంజలో నిలిచాయి. భారత్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఫిన్టెక్, ఎంటర్ప్రైజ్, క్లౌట్ విభాగాల బిజినెస్ డెవలపర్లు అధిక సంఖ్యలో బ్రిటన్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు టెక్ నేషన్ సంస్థ ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.
టెక్ నేషన్... బ్రిటన్లో ప్రముఖ టెక్ దిగ్గజాల సమాఖ్య. సాంకేతిక నిపుణుల దరఖాస్తుల్ని పరిశీలించి, వారికి వీసా ఇవ్వాలో లేదో సిఫార్సు చేసే అధికారాన్ని బ్రిటన్ హోంశాఖ టెక్ నేషన్కు కల్పించింది. అలాంటి సంస్థలు ఆ దేశంలో 5 ఉన్నాయి.
45శాతం వృద్ధి...
డిజిటల్ టెక్నాలజీ రంగంలో టైర్-1 వీసాల కోసం దరఖాస్తు చేసిన భారతీయుల సంఖ్య 2018-19లో 45శాతం పెరిగినట్లు టెక్ నేషన్ వెల్లడించింది.
భారత్, అమెరికా తర్వాత టెక్ వీసా దరఖాస్తుల్లో నైజీరియా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా ముందంజలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది టెక్ నేషన్.
ఇదీ చూడండి: ఫోర్బ్స్ జాబితాలో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ..