ETV Bharat / international

భారత్​కు ఈయూ దేశాల అదనపు సాయం - భారత్​కు ఈయూ అదనపు సాయం

భారత్​కు అదనపు వైద్య పరికరాలు పంపిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య(ఈయూ) ప్రకటించింది. స్పెయిన్, డెన్మార్క్​, నెదర్లాండ్స్​ దేశాలు భారత్​కు తమ వంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లు, వెంటిలేటర్లు, యాంటీవైరల్​ డ్రగ్స్​ అందిస్తున్నట్లు తెలిపింది.

EU
ఐరోపా సమాఖ్య
author img

By

Published : May 4, 2021, 5:20 AM IST

భారత్​లో కరోనా రెండోదశ కొనసాగుతున్న వేళ ప్రపంచదేశాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా అదనపు అత్యవసర వైద్య పరికరాలు సరఫరా చేయనున్నట్లు ఐరోపా సమాఖ్య(ఈయూ) ప్రకటించింది. స్పెయిన్​, డెన్మార్క్​, నెదర్లాండ్స్​ దేశాలు సైతం భారత్​కు సాయం చేయడానికి ముందుకొచ్చాయి.

దీనిలో భాగంగా స్పెయిన్.. 119 ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లు, 145 వెంటిలేటర్లు సరఫరా చేయనుండగా.. డెన్మార్క్​ 53 వెంటిలేటర్లు పంపుతోంది. నెదర్లాండ్స్​ 100 ఆక్సిజన్​ కాన్సం​ట్రేటర్లు, 30 వేల యాంటీవైరల్​ ఔషధాలు, రెమ్​డెసివిర్​తో పాటు.. 449 వెంటిలేటర్లు భారత్​కు అందిస్తున్నట్లు ఈయూ తెలిపింది. అలాగే 15 వేల యాంటీవైరస్​ డ్రగ్స్​తో పాటు 516 వెంటిలేటర్లను జర్మనీ.. భారత్​కు పంపిస్తున్నట్లు పేర్కొంది.

ఈ విపత్కర సమయంలో మిత్ర దేశమైన భారత్​కు సాయం చేస్తున్నందుకు తాము గర్వపడుతున్నట్లు ఈయూ తెలిపింది. కరోనాతో పోరులో విజయం సాధించాలంటే సమష్టి కృషి అవసరమని పేర్కొంది.

కాగా, కువైట్ నుంచి 282 ఆక్సిజన్ సిలిండర్లు, 60 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు భారత్​కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కువైట్​కు ధన్యవాదాలు తెలిపింది భారత విదేశాంగ శాఖ.

మరోవైపు, ఇజ్రాయెల్ సైతం భారత్​కు.. వైద్య సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. ఆక్సిజన్ జనరేటర్లు, రెస్పిరేటర్లు పంపనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. వారం రోజుల వ్యవధిలో భారత్​కు చేరుకునే వివిధ విమానాల్లో వీటిని పంపనున్నట్లు స్పష్టం చేసింది.

ఇప్పటికే ఐరోపా దేశాలైన ఐర్లాండ్​, బెల్జియం, రొమేనియా, లగ్జంబర్గ్​, పోర్చుగల్​, స్వీడన్​, ఫ్రాన్స్​, ఇటలీ, ఆస్ట్రియాలు భారత్​కు తమ వంతు సాయాన్ని అందించాయి.

ఇదీ చూడండి: పేద దేశాలకు 50 కోట్ల మోడెర్నా టీకా డోసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.