ETV Bharat / international

'కరోనా పరీక్షల్లో వెనుకబడిన భారత్‌' - the Liverpool National Health Service System (NHS)

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో వైరస్​ నిర్ధరణ పరీక్షలు చాలా తక్కువగా జరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు బ్రిటన్‌లోని లివర్‌ఫూల్‌ జాతీయ ఆరోగ్య సేవా వ్యవస్థ(ఎన్‌.హెచ్‌.ఎస్‌)కు అనుబంధంగా ఫ్యామిలీ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రాజేష్‌ మద్దిపాటి. ఈనాడు ప్రతినిధితో చరవాణిలో మాట్లాడిన ఆయన మరిన్ని విషయాలను పంచుకున్నారు.

India lagging behind in corona tests
కరోనా పరీక్షల్లో భారత్‌ వెనకబాటే
author img

By

Published : Apr 6, 2020, 10:18 AM IST

కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ వంటి పటిష్ఠ చర్యలను తీసుకుంటున్నా నిర్ధరణ పరీక్షలను ఇప్పటికీ అతి తక్కువగానే జరుపుతుండటం ఆందోళనకరమని బ్రిటన్‌లోని లివర్‌ఫూల్‌ జాతీయ ఆరోగ్య సేవా వ్యవస్థ(ఎన్‌.హెచ్‌.ఎస్‌)కు అనుబంధంగా ఫ్యామిలీ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రాజేష్‌ మద్దిపాటి అభిప్రాయపడ్డారు. ఆయన‘ఈనాడు ప్రతినిధి’తో ఫోన్‌ ద్వారా మాట్లాడారు.

6.70 కోట్ల జనాభా ఉన్న బ్రిటన్‌లో ప్రస్తుతం రోజుకు పదివేల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని... 138 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో తొలుత అతి తక్కువ సంఖ్యలో పరీక్షలు చేసేవారని, ఇప్పటికి రోజుకు పదివేల పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. నెలాఖరుకల్లా రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించే సామర్ధ్యాన్ని అందుకునేందుకు బ్రిటన్‌ సన్నద్ధం అవుతోందని ఆయన తెలిపారు. కరోనా లక్షణాలు ప్రబలంగా కనిపించిన వారికే భారత్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారని, వైరస్‌ను సమర్థంగా అరికట్టేందుకు ఇది సరిపోదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ఎవరికైనా స్పల్పంగా లక్షణాలు ఉన్నా పరీక్ష చేయించడం అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్కువ పరీక్షల వల్ల వైరస్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్న వారు సాధారణంగానే సంచరిస్తారని, దీనివల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంటుందని అన్నారు. తద్వారా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని చెప్పారు. విస్తృతంగా ప్రజలకు పరీక్షలు చేయించడం ద్వారానే దక్షిణ కొరియా, జర్మనీ వైరస్‌ సోకినవారందరినీ సకాలంలో గుర్తించి చికిత్సలు చేయిస్తున్నాయని, ఫలితంగా ఆ రెండు దేశాలలో కేసులతో పోలిస్తే మరణాల శాతం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. 8.37 కోట్ల జనాభా ఉన్న జర్మనీలో పరీక్షల సంఖ్య పదిలక్షలు దాటిందని, ప్రస్తుతం రోజుకు 30వేలు చేస్తున్నారని, వీటిని త్వరలోనే 50వేలకు పెంచబోతున్నారని తెలిపారు. 5.12 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాలో ఇప్పటికే నాలుగున్నర లక్షల మందికి పరీక్షలు చేశారని రోజుకు 11వేలకు పైగా చేస్తున్నారని తెలిపారు.

India lagging behind in corona tests
డాక్టర్‌ రాజేష్‌ మద్దిపాటి

జర్మనీ ముందుచూపు

ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పెట్టే వైరస్‌ మధ్యచైనాలో వచ్చిందన్న సమాచారం రాగానే, వైరస్‌పరీక్షల కిట్ల రూపకల్పనకు జర్మనీలోని శాస్త్రవేత్తలు పూనుకున్నారని చెప్పారు. జనవరి కల్లా ఒకరకం కిట్‌ రూపొందించారని, కొద్దివారాల్లోనే ల్యాబ్‌లకు వాటిని సరఫరా చేశారని చెప్పారు. ఆ దేశంలో తొలి కేసు నమోదు కాకముందే కరోనా పరీక్ష వ్యయాన్ని సార్వత్రిక బీమా పరిధిలోకి చేరస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. తొలిదశలోనే వైరస్‌ సంక్రమించినట్లు కనుక్కోగలిగితే సత్వర చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు. ఈ కారణం వల్లనే ఫ్రాన్స్‌లో 82,165 కేసులకు గాను 6507 మరణాలు ఉంటే, అంత కంటే ఎక్కువగా 91,159 కేసులు ఉన్న జర్మనీలో 1275 మాత్రమే మరణాలు ఉన్నాయని వివరించారు.

ఇతర దేశాల వారికీ చికిత్స

జర్మనీలో వైద్యపరంగా బలమైన వ్యవస్థ ఉందని, అందువల్ల కరోనాతో తీవ్ర కష్టాల పాలవుతున్న ఇటలీ, ఫ్రాన్స్‌ వంటి సహ యూరప్‌ దేశాల రోగులకు కూడా చికిత్స అందించగలుగుతోందని డాక్టర్‌ రాజేష్‌ తెలిపారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న కొందరు రోగులను విమానంలో ఇటలీ నుంచి జర్మనీకి తరలించినట్లు ఆయన చెప్పారు. ఇటలీలో ఐసీయు పడకలు ప్రతి లక్షమందికి 8.6 ఉంటే, జర్మనీలో 33.9 ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని రెట్టింపు చేసే ప్రణాళికను జర్మనీ చేపట్టిందని వివరించారు.

బ్రిటన్‌లో ఆంక్షలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా

‘‘బ్రిటన్‌లో చలికాలం పూర్తయి వసంత కాలం ప్రారంభమైంది. పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకూ ఉంటోంది. ఈ వాతావరణంలో ప్రజలను బయటకు రాకుండా నిలువరించడం కష్టం. అందుకు ప్రభుత్వం తన ఆంక్షలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారికి భారీ జరిమానాలు విధిస్తోంది’’ అని డాక్టర్‌ రాజేష్‌ చెప్పారు. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్నచోట ప్రధాన ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రాథమిక పరీక్షలు జరిపే వ్యవస్థలను భారీగా ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బ్రిటన్‌ తన బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి 15 శాతం ఖర్చుచేస్తోందని, రాజయినా, పేదయినా ఒకేస్థాయి వైద్యం ఇక్కడ అందుతుందని చెప్పారు. కరోనా ప్రభావంతో బ్రిటన్‌లో చదువుకుంటున్న విద్యార్ధులను ఆదుకునేందుకు వివిధ ప్రాంతాల్లోని తెలుగు సంఘాలు కృషిచేస్తున్నాయని ఆయన చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.