ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగించకపోతే.. 20 లక్షల కొవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. అన్ని దేశాలు, పౌరులు ఈ వైరస్ను తరిమికొట్టడానికి కలిసికట్టుగా ముందుకురాకపోతే మరో 10 లక్షలు మరణాలు చోటుచేసుకోవడం పెద్ద విషయమేమీ కాదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పది లక్షలకు చేరువలో ఉండటం ఆందోళనకర పరిణామం.
'పది లక్షలు అనేది భయంకరమైన సంఖ్య. ఇప్పుడు 20 లక్షలు అనే సంఖ్యను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామా? కలిసిపనిచేయకపోతే.. ఆ సంఖ్యను కూడా చూస్తాం. అది చాలా ఎక్కువ. ఊహించదగినది, దురదృష్టవశాత్తూ చాలా అవకాశం కూడా ఉంది' అని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకsల్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు.
చైనాలో కరోనాను గుర్తించినప్పటి నుంచి ఆ వైరస్ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షల 94 వేలమందికిపైగా బలితీసుకుంది. కేసులు 3 కోట్ల 27 లక్షలు దాటాయి.