చనిపోయినవారి దినోత్సవాన్ని (డే ఆఫ్ డెడ్) పురస్కరించుకుని శనివారం బ్రెజిల్‌లోని రియో-డీ-జెనీరో రోడ్లపై సందడి నెలకొంది. కోపకబానా బీచ్ వద్ద వందలాది మంది బ్రెజిలియన్లు అత్యంత భయంకర జోంబీ దుస్తులను ధరించి జోంబీవాక్ సందర్భంగా దారిపొడవునా రాక్షస రూపానందం పొందారు.
దెయ్యాల నడక
"జోంబీ వాక్" అని పిలిచే ఈ వేడుకలను 2007 నుంచి లాటిన్ అమెరికా అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు.
ఏటా ఈ రోజున మరణించిన తమ ఆప్తులు, బంధువుల సమాధుల వద్దకు వెళ్లి వాటిని అలంకరించి వారికి సంతోషాలు పంచే కార్యక్రమాలు చేస్తారు. ఇలా చిత్ర విచిత్రమైన రాక్షస దుస్తులు ధరించి, నకిలీ రక్తపు రంగులు పూసుకుని, భూత, ప్రేత, పిశాచుల్లా మారి వారి ఆత్మలను అలరిస్తారు.
ఈ ఏడాది జరిగిన జోంబీ వాక్ ఉత్సవాల్లో భారీగా జనం పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. దెయ్యాల వేషధారణలో ప్రతిఒక్కరూ తమ బంధువుల ఆత్మలకు శాంతి చేకూరేలా ప్రార్థనలు చేపట్టారు.
2018లో ఇదే రోడ్డుపై రియో డె జనీరో నగర కౌన్సిల్ సభ్యురాలు, ఆమె డ్రైవర్ హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. అయితే, ఆమెకు న్యాయం జరగాలని కోరుతూ శుక్రవారం ఈ రోడ్డుపై నిరసనకారులతో నిండిపోయింది. శనివారం ఇలా సంబరాలతో నిండిపోయింది.
ఇదీ చూడండి: వలకు చిక్కిన చేప ఖరీదు రూ.2 లక్షలు..!