ETV Bharat / international

సరిహద్దుల మూసివేతతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్​ జాం - EU entry ban

కరోనా ప్రభావం ఐరోపా దేశాల్లో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సరిహద్దులను మూసివేశారు. ఈ కారణంగా అక్కడి రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్​లు అవుతున్నాయి. ఇతరులకు అనుమతి లేనందున వేల వాహనాలు సరిహద్దులోనే నిలిచిపోయాయి.

huge-trafficjams-in-europe
సరిహద్దుల మూసివేతతో రోడ్లపై నిలిచిన వేల వాహనాలు
author img

By

Published : Mar 19, 2020, 7:39 AM IST

ప్రపంచ దేశాలను కరోనా కొత్త వైరస్‌ శరవేగంగా కమ్మేస్తుండడం వల్ల ఐరోపా సమాఖ్య (ఈయూ) అష్టదిగ్బంధం విధించుకుంది. చుట్టూ సరిహద్దులను మూసేసింది. ఆసియా మొత్తంమీద సంభవించిన మరణాల కంటే ఐరోపాలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండుమూడు నెలల్లో ఒక్క జర్మనీలోనే కోటి మంది కరోనా బారిన పడతారన్న హెచ్చరికల నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నెల రోజుల పాటు బయటివారిని రానివ్వకుండా సరిహద్దులను మూసివేయనుండడం వల్ల వేల మంది వెనుతిరగాల్సి వచ్చింది. సమాఖ్యలోని దేశాల మధ్య కూడా రాకపోకలపై ఆంక్షలు నెలకొన్నాయి. దీంతో కొన్ని దేశాల సరిహద్దుల్లో 60 కి.మీ. పొడవునా ట్రాఫిక్‌ జాంలు కనిపించాయి. తాజాగా బెల్జియం కూడా తమ ప్రజల్ని దేశం విడిచి వెళ్లకుండా నిర్బంధించింది. ఇటలీలో ఒక్కరోజులోనే 475 మంది మరణించారు.

కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు నేరుగా చెక్కుల ద్వారా ఆరు నెలల పాటు డబ్బు పంపిణీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజితో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ట్రంప్‌ సర్కారు ధీమా వ్యక్తం చేసింది. కరోనాతో మొట్టమొదటగా విలవిల్లాడిన చైనా ఇప్పుడు తెప్పరిల్లుతోంది. కర్మాగారాలు పనిచేస్తున్నాయి.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలకు కరోనా గండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.