ETV Bharat / international

పర్యావరణ ఉద్యమకారిణి థన్​బర్గ్​కు కరోనా!

author img

By

Published : Mar 25, 2020, 10:28 AM IST

పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్... కరోనా వైరస్​ బారిన పడినట్లు స్వయంగా ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దాదాపు 10 రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపింది. ఇటీవల ఆమె సెంట్రల్​ యూరప్ ​నుంచి స్వదేశానికి తిరిగివచ్చింది.

Greta Thunberg says she 'likely' had new coronavirus
పర్యావరణ ఉద్యమకారిణి థన్​బర్గ్​కు కరోనా!

స్వీడన్​కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్​... తనకు కరోనా వైరస్​ సోకిందేమోనన్న అనుమానం వ్యక్తం చేసింది. పది రోజుల నుంచి అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఇటీవల తాను సెంట్రల్​ యూరప్​ ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చాక అస్వస్థత లక్షణాలు బయటపడినట్లు ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది.

"దాదాపు పది రోజుల క్రితం నుంచి అలసట, శరీరంలో వణుకు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి."

-గ్రెటా థన్​బర్గ్, పర్యావరణ ఉద్యమకారిణి.

సెంట్రల్​ యూరప్​ ప్రయాణం ముగించుకుని వచ్చాక... తన తండ్రితో సహా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించింది గ్రెటా. అయితే తాను ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదని తెలిపింది.

ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని... ప్రజలు ముఖ్యంగా యువత ఈ వైరస్​ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది థన్​బర్గ్. కరోనా వైరస్​ నేపథ్యంలో ప్రజలు గుమిగూడడం సరైనది కాదని... ప్రతిఒక్కరూ డిజిటల్​ మాధ్యమాల వేదికగా ఈ విషయంపై నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది.

ఇప్పటి వరకు స్వీడన్​లో 2వేల 272 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి : కరోనా వైరస్ సోకితే రుచి, వాసన తెలియదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.