ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజుకు దాదాపు 5 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.80 కోట్లు దాటింది. నేపాల్‌లో కొత్తగా 3వేలకుపైగా కేసులు వచ్చాయి. అమెరికా, బ్రెజిల్‌తో పాటు రష్యాలోనూ వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.
మొత్తం కేసులు: 48,030,398
మరణాలు: 1,223,172
కోలుకున్నావారు: 34,465,901
యాక్టివ్ కేసులు: 12,341,325
- అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఎన్నికల వేళ రోజు వారి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 70వేల నుంచి 90 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 97 లక్షలకు చేరువైంది.
- రష్యాలో కొత్తగా 19,768 మందికి వైరస్ సోకింది. 389 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది.
- నేపాల్‌లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కొత్తగా 3,309 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కాఠ్మండు లోయలోనే 1,878 కేసులు నమోదు కావటం ఆ ప్రాంతంలో ఆందోళన కలిగిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,82,923కు చేరింది. దేశవ్యాప్తంగా బుధవారం 12,144 టెస్టులు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 9,696,175 | 238,677 |
బ్రెజిల్ | 5,567,126 | 160,548 |
రష్యా | 1,693,454 | 29,217 |
ఫ్రాన్స్ | 1,502,763 | 38,289 |
స్పెయిన్ | 1,331,756 | 36,495 |
అర్జెంటీనా | 1,195,276 | 32,052 |
కొలంబియా | 1,099,392 | 31,847 |