ETV Bharat / international

ఫ్రాన్స్​పై కరోనా పంజా.. ఒక్కరోజే 52 వేల కేసులు

author img

By

Published : Oct 26, 2020, 7:59 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మహా విలయం కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఐరోపాలో రెండో వేవ్​ ప్రారంభమైన క్రమంలో పలు దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. ఫ్రాన్స్​లో రికార్డు స్థాయిలో 52వేల కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. బల్గేరియా ప్రధానమంత్రి బోయికో బోరిస్సోవ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది.

Global COVID-19
కరోనా మహమ్మారి మహా విలయం

ప్రపంచ దేశాలపై కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో రికార్డులు నమోదవుతున్నాయి. ఆదివారం 4 లక్షల కేసులు వెలుగుచూశాయి. మరో 4.5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలోని పలు దేశాల్లో రెండో వేవ్​ ప్రారంభమైంది. ఫ్రాన్స్​, బ్రిటన్​, ఇటిలీ వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. ఫ్రాన్స్​లో రికార్డు స్థాయిలో 52 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తం కేసులు: 43,323,674

మరణాలు: 1,158,825

కోలుకున్నవారు: 31,897,793

యాక్టివ్​ కేసులు: 10,267,056

  • అమెరికాలో వైరస్​ విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 60, 889 మందికి వైరస్​ సోకింది. 442 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 89 లక్షలకు చేరువైంది.
  • బ్రెజిల్​లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 12,900 కేసులు నమోదయ్యాయి. మరో 463 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 54 లక్షలకు చేరువైంది.
  • రష్యాలో కొవిడ్​-19 వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 16,710 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 229 మంది మరణించగా.. అందులో మాస్కోలోనే 62 మంది ప్రాణాలు కోల్పోవటం నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మాస్కోలోనే ఇప్పటి వరకు 6442 మంది మృతి చెందారు.
  • చైనాలో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కష్గర్​ నగరంలో కొత్తగా 100 కేసులు నమోదయ్యాయి. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ కేసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. అయితే.. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదన్నారు.
  • ఫ్రాన్స్​లో కరోనా పంజా విసురుతున్న క్రమంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజు కేసుల్లో ఆదివారం 52వేల కేసులతో సరికొత్త రికార్డు నమోదైంది. గత శనివారం 45,422 కేసులే ఇప్పటి వరకు అత్యధికం.. కాగా ఆదివారం ఆ రికార్డును వెనక్కి నెట్టింది.
  • బ్రిటన్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం 19,790 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 151 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8.73 లక్షలు దాటింది.
  • బల్గేరియా ప్రధానమంత్రి బోయికో బోరిస్సోవ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. వైరస్​ సోకిన ప్రభుత్వ అధికారిని కలిసిన తర్వాత స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు ప్రధాని. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్​ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా8,889,179230,510
బ్రెజిల్5,394,128157,163
రష్యా1,513,87726,050
ఫ్రాన్స్1,138,50734,761
స్పెయిన్​ 1,110,37234,752
అర్జెంటీనా1,090,58928,896
కొలంబియా1,015,88530,154
పెరు888,71534,149
మెక్సికో 886,80088,743

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.