ప్రపంచంపై కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ రోజుకు 3లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి వైరస్ సోకింది. 10.37 లక్షల మందికిపైగా మరణించారు. ఇదే సమయంలో 2.61 కోట్ల మంది కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యాలతో పాటు పలు దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
మొత్తం కేసులు: 35,127,596
మరణాలు: 1,037,941
కోలుకున్నవారు: 26,121,777
యాక్టివ్ కేసులు: 7,967,878
- అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా సోకినవారి సంఖ్య 76 లక్షలు దాటింది. మొత్తం 2.14 లక్షల మందికిపైగా వైరస్ కాటుకు బలయ్యారు. 48.18 లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. 25.68 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- బ్రెజిల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. 1.46 లక్షల మంది వైరస్‌కు బలయ్యారు.
- రష్యాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షలు దాటింది. ఇందులో 9.75 లక్షల మంది కోలుకోగా.. 2 లక్షల మంది వరకు చికిత్స పొందుతున్నారు. కేసులు పెరుగుతున్నా మరణాలను కట్టడి చేయగలిగింది రష్యా. 21వేల మంది మరణించారు.
- కొలంబియాలో కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 8.5 లక్షలకు చేరువైంది. 26 వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ఉద్థృతి అధికంగా ఉన్న మెక్సికో, స్పెయిన్‌ను దాటుకుని ఐదో స్థానానికి చేరుకుందీ దేశం.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు..
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 7,600,846 | 214,277 |
బ్రెజిల్ | 4,906,833 | 146,011 |
రష్యా | 1,204,502 | 21,251 |
కొలంబియా | 848,147 | 26,556 |
పెరు | 824,985 | 32,665 |
స్పెయిన్ | 810,807 | 32,086 |
అర్జెంటీనా | 790,818 | 20,795 |
మెక్సికో | 757,953 | 78,880 |