ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్ పేరును ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్. మూడేళ్లు పదవిలో ఉన్న ఎడ్వర్డ్ ఫిలిప్పీ రాజీనామా అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: గల్వాన్ వీరులకు ఫ్రాన్స్ రక్షణమంత్రి సంఘీభావంకరోనా వైరస్ సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మెక్రాన్. ఆ దిశగా తనకున్న రెండేళ్ల పదవీ కాలంలో కాస్టెక్స్తో కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.