కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లో కఠిన ఆంక్షలను అమలులోకి తెచ్చారు. దేశ వ్యాప్తంగా పాఠశాలలను మూడు వారాల పాటు మూసివేస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రకటించారు. నెల రోజుల పాటు దేశీయ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో స్పష్టం చేశారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కూడా విధిస్తున్నట్లు మెక్రాన్ ప్రకటించారు.
ఇప్పటికే ఈ ఆంక్షలు రాజధాని పారిస్, ఈశాన్య పారిస్‌లో అమలు చేస్తుండగా, వీటిని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు అవసరం అని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు. ఫ్రాన్స్‌లో కరోనా పరిస్ధితిపై గురువారం ఆ దేశ పార్లమెంటులో చర్చ జరగనుంది.
ఫ్రాన్స్‌లో బుధవారం 41వేల 907 కేసులు బయటపడగా, 303 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 64వేలు దాటగా, 95వేల 460 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో కరోనాతో బాధపడుతూ మంగళవారం నాటికి 5వేల మంది ఐసీయూలో ఉన్నారు.
ఇదీ చదవండి: టెక్సాస్ నిర్బంధ కేంద్రంలో 4,000 మంది వలసదారులు!