
కమ్యూనిస్ట్ ఆధారిత సీజీటీ యూనియన్ మంగళవారం సిటీ హాల్ నుంచి ప్లేస్ డి లా కాంకోర్డే వరకు ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపింది.
" ఇరువురి మధ్య ఉన్న సాధారణ డిమాండ్లను నెరవేర్చటం అవసరం. ఇప్పుడు మేము వారితో ఉన్నాం. వారితో కలవకపోవడానికి మాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. సంయుక్తంగా నిర్వహించిన మొదటి ర్యాలీ విజయవంతమైంది. మొదటగా సరికొత్త కార్యక్రమాలతో రావటం అవసరం. ఈ రోజు చాలా మద్దతు లభించింది. మాతో చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా ఎక్కువ మంది అవసరం. మంగళవారాల్లో కొత్త కొత్త ప్రయత్నాలతో పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నా. "
- ఫిలిప్ మార్టినెజ్, సీజీటీ యూనియన్ ముఖ్య కార్యదర్శి
మంగళవారం నిర్వహించిన నిరసనల్లో పలు సార్లు బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అయిననప్పటికీ మూడు నెలలుగా జరుగుతున్న వారాంతపు పసుపు జాకెట్ నిరసనలతో పోల్చితే మంగళవారం జరిగిన ఆందోళన ప్రభావం తక్కువగానే ఉంది.