ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో దిగ్గజ విమాన తయారీ సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, భద్రతా సమస్యలను అధిగమించి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో వారు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఎయిర్‌బస్ ఈసారి తమ విమానాలకు భారీ స్థాయిలో ఆర్డర్లు రావాలని ఆశిస్తోంది. ఓ కొత్త సింగిల్ ఐల్ దీర్ఘ శ్రేణి జెట్‌ను ఆవిష్కరించింది. ఈ విభాగంలో తన ప్రత్యర్థి బోయింగ్‌ను వెనక్కినెట్టి, మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
ఇండోనేసియా, ఇథియోపియాల్లో తమ విమానాలు కూలడం, మ్యాక్స్ కాక్‌పిట్‌లో హెచ్చరిక వ్యవస్థ విఫలం కావడం తదితర సమస్యలను బోయింగ్ ఎదుర్కొంది. వాటిని అధిగమించి ప్రస్తుత ఎయిర్‌షోలో నమ్రతతో పాల్గొంటున్నట్లు ఆ కంపెనీ సీఈఓ తెలిపారు.
ఈ ఎయిర్‌షోలో ఎలక్ట్రిక్ విమానాలు, పైలెట్ రహిత ఎయిర్ టాక్సీలు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడిన విమానాలను ప్రదర్శించారు.
ఇదీ చూడండి: భాజపా తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా