ETV Bharat / international

ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు.. 23 మంది మృతి

నాగోర్నో-కారాబాఖ్.. అజెర్బైజాన్​కు చెందిన ప్రాంతం. ఓ యుద్ధం వల్ల ఆర్మేనియా నియంత్రణలోకి వెళ్లింది. అప్పట్నుంచి ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. అయితే ఆదివారం రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో.. 23 మంది మరణించారు. 100మందికి పైగా గాయపడ్డారు.

author img

By

Published : Sep 27, 2020, 9:45 PM IST

Updated : Sep 28, 2020, 8:01 AM IST

Fighting between Armenia and Azerbaijan broke out regard of separatist region Nagorno-Karabakh, 2 killed
అజెర్బైజాన్​, ఆర్మేనియా​ మధ్య యుద్ధ ప్రకంపనలు!

ఆర్మేనియా, అజెర్బైజాన్​ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అజెర్బైజాన్​కు చెందిన మూడు యుద్ధ ట్యాంకర్లు ఆ ప్రాంతంలో దాడి చేశాయని.. ఘటనలో ఓ మహిళ, చిన్నారి మృతి చెందినట్లు ఆర్మేనియా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వెంటనే స్పందించిన తమ దళాలు అజెర్బైజాన్​కు చెందిన రెండు హెలికాప్టర్​లను కూల్చివేసినట్లు ఆర్మేనియా స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని అజెర్బైజాన్​ రక్షణ మంత్రి అంగీకరించలేదు. అయితే కొన్ని స్థానిక మీడియా వర్గాల ప్రకారం.. ఇరుదేశాల ఘర్షణలో 23 మంది చనిపోగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

మరణించిన 23మందిలో 16మంది ఆర్మేనియా వేర్పాటు వాదులున్నారు. ఆ దేశానికే చెంది ఓ మహిళ , చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు. అజెర్బైజాన్​కు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు ఈ ఘర్షణలో మరణించారు.

టర్కీ స్పందన...

అజెర్బైజాన్​తో సాన్నిహిత్యం గల టర్కీ తాజా ఘటనపై స్పందించింది. ఆర్మేనియా దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. అయితే అజెర్బైజాన్​ బలగాలే తొలుత తమపై దాడి చేశాయని.. వాటిని ఎదుర్కోవడానికే తాము ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని ఆర్మేనియా వాదిస్తోంది.

"ఈ దాడితో ఆర్మేనియా మరోసారి నిబంధనలను ఉల్లంఘించింది. మేము అజెర్బైజాన్​కు అండగా నిలుస్తాం. ఆర్మేనియా నిప్పుతో చెలగాటమాడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆర్మేనియా ఉల్లంఘించింది. ఈ విద్వేషపూరిత చర్యలపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి."

-- టర్కీ

పర్వతప్రాంతాలతో నిండి ఉన్న నాగోర్నో-కారాబాఖ్​ 4,400 చదరపు కిలోమీటర్ల విస్త్రీర్ణంలో ఉంది. ఇది ఆర్మేనియా సరిహద్దు నుంచి 50 కి.మీ. దూరంలో ఉంటుంది. అజెర్బైజాన్​కు చెందిన ఈ ప్రాంతం 1994 తర్వాత ఆర్మేనియా​ నియంత్రణలోకి వెళ్లింది. అయితే తమ ప్రాంతాన్ని తిరిగివ్వాలని అజెర్బైజాన్​ అంతర్జాతీయ వేదికలపై తమ వాదన వినిపించినా.. ఫలితం రావడం లేదు. జులై నెలలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగగా.. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

Last Updated : Sep 28, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.